శాఱ్ఱుముర – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

సర్వ దేశ దశా కాలేషు అవ్యాహత పరాక్రమా।
రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్ధతాం॥

భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు (విశిష్థాద్వైత సిద్దాంతము, శ్రీ వైష్ణవ సూత్రాలు) నలువైపుల ఎటువంటి అడ్డంకులు లేకుండా శ్రేష్ఠమైన రీతిలో అభివృద్ధి చెందుగాక. వర్దిల్లు గాక.

రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతివాసరముజ్వలా।
దిగంతవ్యాపినీ భూయాత్ సాహి లోక హితైషిణీ॥

భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు వివిధ రీతులలో దిన దినము ప్రకాశవంతంగా వృద్ధి చెందాలి. ఈ ఆదేశములు ప్రతి దిశలో వ్యాపించి అందరికీ మంచిని చేకూర్చాలి.

శ్రీమన్! శ్రీరంగ శ్రియ అనుపద్రవాం అనుదినం సంవర్ధయ।
శ్రీమన్! శ్రీరంగ శ్రియ అనుపద్రవాం అనుదినం సంవర్ధయ॥

శ్రీరంగ శ్రీ ప్రతి నిత్యమూ ఎటువంటి అవరోధము లేకుండా అభివృద్ధి చెందాలి. శ్రీరంగ శ్రీ ప్రతి నిత్యమూ ఎటువంటి అవరోధము లేకుండా అభివృద్ధి చెందాలి.

నమః శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే।
ప్రసాద లబ్ద పరమ ప్రాప్య కైంకర్య శాలినే॥

కుంతి నగరంలో జన్మించి, అత్యున్నత కైంకార్యముని (వారి ఆచార్య కృపతో) సాధించిన శ్రీశైలనాథునికి (తిరుమలై ఆళ్వారు – తిరువాయ్మొళి పిళ్ళై) నా నమస్కారాలు .

శ్రీశైలశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం।
యతీంద్ర పరణం వందే రమ్యజామాతరం మునిం॥

తిరుమలై ఆళ్వార్లని నిత్యము ఆరాధించువారు, జ్ఞానం, భక్తి మొదలైన శుభ లక్షణాల మహాసాగరము కలిగినవారు, యతింద్రులతో (శ్రీ రామానుజులు) ఎంతో అనుబంధం ఉన్న వారైన అళగియ మణవాళ మాముణులను నేను ఆరాధిస్తాను.

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖామయం సదా
తతా యత్తాత్మ సత్తాదిం రామానుజ మునిం భజే

మాముణులకు దాసులుగా తమ నిజ స్వరూపాన్ని, తమ మనుగడని మరియు నడవడికను మొదలైనవాటిని సాగించుటకు వారిపై పూర్ణముగా ఆధారపడి, మాముణుల దివ్య చరణాల ముద్రల వలె ఉన్న వానమామలై జీయర్ని నేను ఆరాధిస్తాను.

— శ్రీ వానమామలై ముఠం పాఠము]

వాళి తిరువాయ్మొళి ప్పిళ్ళై మాదగవాల్ వాళుం,
మణవాళ మామునివన్ వాళియవన్,
మాఱన్ తిరువాయ్మొళిప్పొరుళై మానిలత్తోర్
తేఱుం పడి ఉరైక్కుం శీర్

తిరువాయ్మొళి ప్పిళ్ళైల కృపతో జీవించే మణవాళ మాముణులు చిరకాలం వర్ధిల్లాలి! ఈ విశాల భూమిపై జీవిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవటానికి, ఉద్ధరింపబడడానికి నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి అర్ధాలను క్లుప్తంగా వివరించే మాముణులు చిరకాలం వర్ధిల్లాలి!

శెయ్య తామరై త్తాళిణై వాళియే
శేలై వాళి తిరునాబి వాళియే
తుయ్య మార్బుం పురినూలుం వాళియే
సుందర త్తిరుత్తోళిణై వాళియే
కైయుమేందియ ముక్కోలుం వాళియే
కరుణై పొంగియ కణ్ణిణై వాళియే
పొయ్యిలాద మణవాళ మాముని
పుంది వాళి పుగళ్ వాళి వాళియే

మాముణుల ఎర్రటి దివ్య పాద పద్మాలు చిరకాలం వర్ధిల్లాలి! వారు ధరించే దివ్య కాషాయ వస్త్రము, వారి దివ్య నాభి చిరకాలం వర్ధిల్లాలి! వారి స్వచ్ఛమైన దివ్య వక్ష స్థలము, దివ్య యఙ్యోపవీతము చిరకాలం వర్ధిల్లాలి! వారి రెండు దివ్య భుజాలు రెండూ చిరకాలం వర్ధిల్లాలి! వారి దివ్య హస్థాలతో పట్టుకొని ఉన్న త్రిదండము చిరకాలం వర్ధిల్లాలి! కరుణను వెదజల్లే వారి దివ్య నేత్రాలు రెండూ చిరకాలం వర్ధిల్లాలి! ఎటువంటి కల్మషము లేని మణవాళ మాముణుల యదార్థ జ్ఞానం చిరకాలం వర్ధిల్లాలి!

అడియార్గళ్ వాళ అరంగ నగర్ వాళ
శఠకోపన్ తణ్డమిళ్ నూల్ వాళ – కడల్ శూళ్ంద
మన్నులగం వాళ మణవాళ మామునియే
ఇన్నుమొరు నూఱ్ఱాండిరుం॥

భగవానుడి దాసులు, భాగవత దాసులు చిరకాలం వర్ధిల్లాలి!! గొప్ప పట్టణమైన శ్రీరంగం చిరకాలం వర్ధిల్లాలి!! నమ్మాళ్వార్ల చల్లని ప్రబంధాలు చిరకాలం వర్ధిల్లాలి! నలువైపులా సముద్రముతో చుట్టు ముట్టి స్థిరంగా ఉన్న ఈ ప్రపంచము చిరకాలం వర్ధిల్లాలి!! ఓ మణవాళ మాముని! మీ ఔన్నత్యము మాతో నిత్యము ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించాలి.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/07/sarrumurai-simple/

పొందుపరచిన స్థానము : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment