Daily Archives: February 26, 2021

thiruviruththam – 62 – iRaiyO irakkinum

Published by:

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama:

Full Series

Previous

avathArikai (Introduction)

In the previous pAsuram, AzhwAr was reminiscing about krishNavathAram. He felt saddened that he had not been born in this world, during that time. Due to the pain of this separation, he returned to his earlier feminine mood (as nAyaki). Her mother says that the sounds of the ocean aggravated her distress of separation.

Let us go through the pAsuram and its meanings:

iRaiyO irakkinum IngOr peNpAl enavum irangAdhu
aRaiyO ena ninRu adhirum karungadal IngivaL than
niRaiyO ini un thiruvaruLAl anRik kApparidhAl
muRaiyO aravaNaimEl paLLi koNda mugil vaNNanE

Word-by-Word Meanings

karum kadal ocean which has a dark complexion
irakkinum – even if beseeched
Or – without any support
peNpAl enavum – even if the person happens to be a lady
Ingu – in her matters
iRai – even a little bit
irangAdhu – is not taking pity
aRaiyO ena – like those who make a huge noise
ninRu – remaining firmly
adhirum – it is making a noise
O – Oh, how cruel!
aravaNai mEl – on top of the mattress, AdhiSEshan
paLLikoNda – one who has reclined
mugil vaNNanE – Oh lord, who has the complexion of cloud!
Ingu – at this place
ivaL than – her
niRaiyO – modesty
ini – henceforth
un thiruvaruLAl anRi – other than by your mercy (with any other entity)
kAppu aridhu – difficult to protect
muRaiyO – (is this) apt?

Simple Translation

The dark ocean, despite being beseeched by her, is not taking any pity on her, even though she is without any support. The ocean is like those who are making a war-cry, being very firm. How cruel is this! Oh lord, who is having the complexion of cloud and who is reclining on the mattress, AdhiSEshan! Her situation is such that she cannot be protected by anything other than your mercy, henceforth. Is her condition proper?

vyAkyAnam

irakkinum IngOr peNpAl enavum iRaiyO irangAdhu – this ocean is not taking even a little bit of pity on her despite her falling at its feet, saying “taking refuge is indeed a great act which manifests her state”, despite hinting “she is without any help and has no other refuge”. This is similar to revealing our weakness to those who harm us, thus giving them an opportunity to harm us even more. vyAkyAthA cites SrI rAmAyaNam yudhdha kANdam SlOkam 21-8 “adhya mE maraNam vAtha tharaNam sAgarasya vA” (Sri rAma says that today either he should cross the ocean or die). Even after SrI rAma performed SaraNAgathi (surrendered) to the king of ocean, he did not come. However, the moment he strung the arrow on his bow, he came helter-skelter. Thus, the ocean will not take pity for SaraNAgathi, but will, for the arrow. It will not consider SaraNAgathi but will take pity when faced with death.

aRaiyO ena ninRu adhirum kadal – the ocean behaved like sugrIva who sounded the war-cry on vAli saying “Will you come out of your hiding to fight with me?”

karum kadal – the ocean appears as if its anger inside is visible on its surface. Just as the saying goes “sivappum karuppum sinam” (red and black colours are manifestation of anger)

Ingu . . . – the modesty of this girl who is in such a distressed state.

un thiruvaruL anRik kApparidhAl – she has lost her senses due to her deep love for you; without your mercy, which is the manifestation of your true nature, she will not revive. She has crossed the stage when she could have corrected herself, due to fear of being ridiculed by the people of the town.

muRaiyO – SrI rAmAyaNam sundhara kANdam 39-30 says “thath thasya sadhruSam bhavEth” ((sIthAppirAtti tells hanuman) if SrI rAma comes here and takes me with him after destroying lankA, it will be appropriate for his valour). Instead of waiting like that for him, here, the nAyaki is calling out to him to protect her; this is her situation now.

aravaNai . . . – her beauty and the arrangement of the mattress are such that even if she had dressed herself in saffron robe (indicating renunciation) she should have been accepted.

aravaNai mEl – while she is lying on the hard floor, you are looking out for a soft mattress.

mugil vaNNanE – when a person was reading out this line, embAr (disciple and successor of ramAnujar) [sarcastically] told him “even after she has called out so much, if he is not going to turn in her direction, he should be a great sage. Hence, instead of saying mugil vaNNan, call him as mugil vaNNar (the end syllable ar in vaNNar is an honorific term, indicating respect while the end syllable an in vaNNan indicates someone who is of same status or lower status). Even if one gets hit with stick, the person who is hitting should be addressed respectfully” embAr is one who takes delight in the togetherness of perumAL and pirAtti; here, he takes the side of pirAtti when they are separated [and shows his anger on perumAL who is delaying in uniting with pirAtti].

svApadhESam (distinguished meaning): This pAsuram illustrates how the distress in separation makes one to destroy one’s svarUpam (true nature) to attain the end benefit, instead of waiting for the appropriate time, in line with one’s svarUpam.

adiyEn krishNa rAmAnuja dhAsan

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

periya thirumozhi – 1.3.7 – pappa appar

Published by:

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama:

periya thirumozhi >> First centum >> Third decad

<< Previous

Highlights from avathArikai (Introduction)

No specific introduction.

pAsuram

pappa appar mUththavARu pAzhppadhu sIththiraLai
oppa aikkaL pOdha vundha un thamar kANmin enRu
seppu nErmen kongai nallAr thAm siriyAdha munnam
vaippum nangaL vAzhvum AnAn vadhari vaNangudhumE

Word-by-Word meanings

sIththiraLai oppa – like a cluster of pus
aikkaL – mucus
pOdha undha – as it get pushed out (seeing that)
seppu nEr – like a copper pot
mel – soft
kongai – having bosoms
nallAr – the women whom he thought to be his well-wishers
pappa – “Oh my”
appar – the elderly person
mUththa ARu – the way he has aged
pAzhppadhu – is unbelievably bad (saying this way)
thAm – they (who liked him previously, looking at those who were nearby)
un thamar – he who is related to you
kANmin – see his state
enRu – saying this
siriyAdha munnam – before they make fun
nangaL – for us
vaippum – wealth for emergency situations
vAzhvum AnAn – our prosperous life, his
vadhari – SrI badhari
vaNangudhum – let us worship

Simple translation

When cluster of pus which appears like mucus gets pushed out, the women whom he thought to be his well-wishers, who have soft, copper pot like bosoms would say “Oh my! The way this elderly person has aged is unbelievable” and would tell those who are nearby “see the state of this person who is related to you” and make fun of him; let us worship SrI badhari which is the abode of emperumAn who is our wealth for emergency situations and our prosperous life before such situation.

Highlights from vyAkyAnam (Commentary)

  • pappa – AzhwAr is repeating the way the women make fun of this elderly person (who was highlighted in previous pAsuram). pappa – Oh my.
  • appar mUththa ARu – Those women will say “None can avoid old age; but none become as aged as this person!” If we consider regular old age as youth, this will be old age for such state.
  • pAzhppadhu – This made them hate this body and say “This is very bad; this is very very ugly!”
  • sI … – As the mucus get pushed out looking similar to a cluster of pus. As the mucus gets pushed out as a cluster of pus, they will say “Oh my! He is too old! He is very ugly!”
  • un thamar kANmin enRu – While he was youthful and wealthy, they would say “My man! My man!” Now that he has lost his youth and wealth, to make one feel bad about the relationship with him, they would tell each other “He is your man! He is your man!” and argue with each other.
  • seppu … – To make fun of him and play with him, they would relax their upper garment and show a little bit of their bosoms. Opening his eyes, he will try to look at that; seeing that they will tell each other “Girl! With what relationship with these is he trying to look at them?” and laugh at him. Also said as “seppu nEr men kongai nallAr – appar enRu siriyAdha munnam” (Before the women who have copper pot like soft bosoms laugh at him saying “He is too old”) Previously, he would present all his wealth to those girls and get their smile in return; now they will laugh at him just seeing his state of existence.
  • vaippum nangaL vAzhvum AnAn – Worship the divine abode of the one who becomes the sAdhanam (means) immediately when pursued and subsequently the prApyan (end goal). He is not the type who likes at times and laughs at other times. It is said in vishNu dharmam 72.4 “amrutham sAdhanam sAdhyam” (one who is like nectar, means and end goal).

In the next article we will enjoy the next pAsuram.

adiyen sarathy ramanuja dasan

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 31- 40

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్షిక

ముప్పై ఒకటవ పాశురము:  అనేక జన్మలెత్తి (ఈ సంసార సాగరములో) బాధ పడుతున్న జీవులు, ఎంబెరుమానార్ కృపతో వారినే చేరుకున్నారని పరమానందముతో అముదనార్ తన హృదయానికి చెబుతున్నారు.

ఆండుగళ్‌ నాళ్‌ తింగళాయ్ ।‌ నిగళ్‌ కాలమెల్లాం మనమే 
ఈండు। పల్‌ యోనిగళ్‌ తోఱు ఉళల్వోం * ఇన్ఱు ఓర్ ‌ ఎణ్‌ ఇన్ఱియే                                   కాణ్‌ తగు తోళ్‌ అణ్ణల్‌ తెన్‌ అత్తియూరర్‌ కళల్‌ ఇణైక్కీళ్
ప్పూండ అన్బాళన్। ఇరామానుశనై ప్పొరుందినమే॥ (31)

ఓ మనసా! మనము అనేక జన్మలలో రకరకాల మనుషులు/పదార్థాల నడుమ లెక్కలేని రోజులు, నెలలు చివరికి సంవత్సరాలు శ్రమించాము. కానీ, ఈనాడు ఇక మరో ఆలోచన చేయక, దివ్య భుజాలతో తిరు అత్తియూర్లో (కాంచీపురము) నిత్య నివాముంటున్న దేవరాజ పెరుమాళ్ల దివ్య తిరువడిఘళ్ళ ని అమితంగా అభిమానించే ఎంబెరుమానార్లని పొందినందుకు  ఈ రోజు మనము అదృష్టవంతులుగా భావించాలి.  

ముప్పై రెండవ పాశురము:   ఎంబెరుమానార్ ని పొందిన అముదనార్ని ఈ ఆనంద స్థితిలో చూసిన కొందరు ఇలా అడిగారు, “మేము కూడా ఎంబెరుమానార్ ని పొందాలని ఆశిస్తున్నాము; కానీ మీ మాదిరిగా ఆత్మగుణాలు మాలో లేవు”. దానికి బదులుగా, “ఎంబెరుమానార్లని పొందిన వారికి ఆత్మగుణాలు వాటంతట అవే వస్తాయి” అని అన్నారు.

పొరుందియ తేశుం పొఱైయుం తిఱలుం పుగళుం। నల్ల
తిరుందియ ఞ్ఙానముం। శెల్వముం శేరుం* సెఱు కలియాల్‌                            వరుందియ ఞ్ఙాలత్తై  వణ్మైయినాల్।‌  వందెడుత్తళిత్త
అరుందవన్। ఎంగళ్‌ ఇరామానుశనై। అడైబవర్‌క్కే॥ ( (32)

ఈ కలి కాలములో బాధపడుతున్న లోకాన్ని చూసి ఔదార్యులైన రామానుజులు  ఉద్దరించి రక్షించారు.  ఎంబెరుమాన్ కి శరణాగతులైన వారికి ప్రతినిధిగా, మనతో శరణాగతి చేయించగల గొప్ప తపశ్శాలులై ఉన్నారు. వారిని పొందిన వారికి, స్వరూపము, సహనము, ఇంద్రియ నిగ్రహము, మంచి గుణాల వల్ల గొప్పదనము, స్పష్టమైన తత్త్వ జ్ఞానం, హితము, పురుషార్థము, భక్తి సంపద వంటివి వాటంతట అవే లభిస్తాయి. 

ముప్పై మూడవ పాశురము: ఎంబెరుమానార్ ని ఆశ్రయించేందుకు మన ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలనే ప్రశ్నకు బదులుగా, ఐదు దివ్య ఆయుధములు రామానుజుల నియంత్రణలో ఉంటాయని అముదనార్లు తెలియజేస్తున్నారు. ఐదు దివ్య ఆయుధములే రామానుజులుగా అవరించాయని చెప్పినట్టు మనం మరో అర్థము కూడా చెప్పుకోవచ్చు.

అడైయార్‌ కమలత్తలర్మగళ్‌ కేళ్వన్। కై ఆళి ఎన్నుం
పడైయోడు నాందగముం। పడర్‌ తణుడుం* ఒణ్‌ శార్ఞ్గ విల్లుం
పుడై ఆర్‌ పురి శంగముం। ఇంద ప్పూదలం కాప్పదఱ్కు ఎన్ఱు
ఇడైయే। ఇరామానుశ ముని ఆయిన ఇన్నిలత్తే॥  (33)

విరబూసిన పద్మము పిరాట్టి నివాస స్థలము. ఆమెకు భర్త అయిన భగవానుని దివ్య హస్తాలలో, దివ్య ఆయుధముల రూపంగా సుదర్శన చక్రము, నందక ఖడ్గములు, గద, శార్ఞ్గము, పాంచజన్యము విరాజిల్లును. ఈ దివ్య ఆయుధాలన్నీ ఈ భూమిపైన మన రక్షణార్థం ఎంబెరుమానార్ల వద్దకు వచ్చి చేరినవి. ఈ  దివ్య ఆయుధములన్నీ రామానుజులుగా అవరించాయని మనము మరో అర్థము కూడా తీసుకోవచ్చు.

ముప్పై నాల్గవ పాశురము:  కలి దోషాన్ని తొలగించి భూమిని కాపాడిన తరువాత కూడా రామానుజుల కళ్యాణ గుణాలు ప్రకాశించలేదు, తన కర్మ తొలగిన పిదప వారి గుణాలు గొప్పతనాన్ని పొందాయని అముదనార్లు తెలియజేస్తున్నారు.

నిలత్తై చ్చెఱుత్తుణ్ణుం నీశ క్కలియై। నినైప్పు అరియ
పలత్తై చ్చెఱుత్తుం। పిఱంగియదిల్లై* ఎన్‌ పెయ్‌ వినై తెన్‌
పులత్తిల్‌ పాఱిత్త అప్పుత్తర చ్చుమ్మై। పాఱుక్కియ పిన్।
నలత్తై ప్పొఱుత్తదు। ఇరామానుశన్ తన్ నయ ప్పుగళే॥ (34)

సామాన్యులకు అలవి కాని ఈ అపేక్షనీయమైన ఎంబెరుమానార్ల దివ్య కళ్యాణ గుణాలు కేవలం ఈ భూమిని బాధపెట్టి హింసిస్తున్న కలిని తొలగించిన తరువాత ప్రకాశించలేదు, నా పాపాలు తొలగి,  పిదప యమలోకములో ఆ పుస్తకములో నా పేరుమీద ప్రవేశింపబడిన పాపాల బరువు తగ్గిన తరువాత  మాత్రమే అవి దేదీప్యమానమైనవి.

ముప్పై ఐదవ పాశురము: రామానుజులు తొలగించిన పాపాలు తనలో మళ్లీ వచ్చి స్థిరపడితే ఎలా అని అడిగినపుడు, అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదు అని అముదనార్లు చెబుతున్నారు.

నయవేన్ ఒరు తెయ్వం నానిలత్తే। శిల మానిడత్తై
ప్పుయలే ఎన క్కవి పోఱ్ఱి శెయ్యేన్*  పొన్ అరంగం ఎన్నిల్‌
మయలే పెరుగుం ఇరామానుశన్। మన్ను మా మలర్‌త్తాళ్‌
అయరేన్। అరువినై ఎన్నై। ఎవ్వాఱు ఇన్ఱు అడర్ ‌ప్పదువే॥ (35)

ఇతర దేవతలను నేను ఆరాధించను. ఈ భూమిపైన అల్పులను వారి ఔదార్యాన్ని మేఘాలతో పోల్చి పాశురములను పాడను. శ్రీరంగము పేరు వింటేనే రామానుజులు పులకరించిపోతారు. అటువంటి రామానుజుల దివ్య పాదయుగళిని ఎన్నడూ మరవను. తొలగించడానికి కష్టమైన దుష్కర్మలు నా దగ్గరకి ఎలా వస్తాయి?

ముప్పై ఆరవ పాశురము: “నీవు వారిని మఱవలేవు అని అంటున్నావు. వారిని మెము కూడా పొందేందుకు దయచేసి వారి స్వభావము గురించి మాకు వివరించుము” అని  అముదనార్లని విన్నపించుకున్నారు. వారు వాత్సల్యముతో చెప్పసాగారు.

అడల్‌ కొండ నేమియన్। ఆరుయిర్‌ నాదన్। అన్జారణ చ్చొల్‌
కడల్‌ కొండ ఒణ్ పొరుళ్।‌ కండళిప్ప * పిన్నుం కాశినియోర్                                   ఇడరిన్ కణ్  వీళందిడ త్తానుం అవ్వొణ్ పొరుళ్‌ కొండు అవర్‌                                పిన్ పడరుం గుణన్ । ఎం ఇరామానుశన్ తన్ పడి ఇదువే॥ (36)

సమస్థ ఆత్మలకు స్వామియై, శత్రువులను ఓడించే శక్తి గల దివ్య చక్రాయుధము చెంత ఉన్న సర్వేశ్వరుడు, సమస్థ ఆత్మలను ఉద్దరింపబడాలని విశాద స్థితిలో ఉన్న అర్జునుడికి నిగూఢమైన, అమూల్యమైన అర్థములను కృపతో శ్రీ భగవద్గీతగా అందించారు. ఆ తరువాత కూడా, ఈ భూమిపైన ఉన్నవారు దుఃఖ సంసార సాగరములో మునిగి ఉన్నారు. సర్వేశ్వరుడు అందించిన ఆ అమూల్యమైన అర్థములను ( శ్రీ భగవద్గీత) ఉపయోగించి, అటువంటి వాళ్ళను రక్షించే స్వభావము ఎంబెరుమానార్లది.

ముప్పై ఏడవ పాశురము: అటువంటి ఎంబెరుమానార్ దివ్య తిరువడిని ఎలా పొందగలిగారు అని అముదనార్లని ప్రశ్నించినపుడు, పూర్తి జ్ఞానముతో వారిని పొందలేదని వారు తెలుపుతున్నారు. ఎంబెరుమానార్ దివ్య తిరువడిని అపేక్షించిన వారితో సంబంధము పెట్టుకోవాలనుకున్నవారు నన్ను వారి దాసునిగా చేసుకున్నారు అని వివరిస్తున్నారు.   

పడి కొండ కీర్‌త్తి। ఇరామాయణం ఎన్నుం పత్తి వెళ్ళం।                                              కుడి కొండ కోయిల్। ఇరామానుశన్ గుణం కూఱుం* అన్నర్‌
కడి కొండ మా మలర్‌ త్తాళ్।‌ కలందు ఉళ్ళం కనియుం నల్లోర్                                    అడి కండు కొండు ఉగందు।  ఎన్నైయుం ఆం‌ అవర్ ‌క్కాక్కినరే॥ (37)

ప్రపంచ వ్యాప్తి చెందిన, భక్తి సాగరమైన శ్రీ రామాయణానికి కేంద్రము ఎంబెరుమానార్. రామానుజ దాసులు వారి మంగళ గుణాలను నిత్యము ప్రశంసిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా రామానుజ దాసుల దివ్య పాదధూళికి తమ భక్తిని సమర్పించుకుంటున్న మహాపురుషులు, ఈ నా స్థితిని చూసిన పిదప ఈ ఆత్మ (అముదనార్) కూడా రామానుజ దాసుడు కావాలని ఆశించిరి. అటువంటి రామానుజ దాసుల సంబంధము చేత వారు (అముదనార్లు) రామానుజులకు శిష్యులు అయ్యారు.

ముప్పై  ఎనిమిదవ పాశురము: ఎంబెరుమానార్ మహోన్నతుడని పరిగణించి, ఇంత కాలము వారి నీడలోకి ఎందుకు తీసుకోలేదని అముదనార్ ప్రశ్నిస్తున్నారు. 

ఆక్కి అడిమై। నిలైప్పిత్తనై। ఎన్నై ఇన్ఱు అవమే                                                            పోక్కి ప్పుఱత్తిట్టదు* ఎన్ పొరుళా మున్బు పుణ్ణియర్‌ తం
వాక్కిల్‌ పిరియా ఇరామానుశ।  నిన్ అరుళిన్ వణ్ణం                                              నోక్కిల్‌ తెరివరిదాల్।‌ ఉరైయాయ్‌ ఇంద నుణ్‌ పొరుళే॥ (38)

“నేను ఈశ్వరుడిని” అన్న భావనతో ఉన్న నన్ను నీ శిష్యునిగా చేర్చుకున్నావు. పైగా నీ దాసులకి దాసునిగా దృఢపరచావు. ఈ ఉన్నత స్థితిని అధీష్థించిన నన్ను ఏ కారణము చేత ఈ లౌకిక వ్యవహారములలో నెట్టావు? నిన్ను నిత్యము అనుభవించే అదృష్థవంతులు నిన్ను నిత్యము వారి సంభషణలలో ఉంచుకుంటారు. ఒక్కొక్కప్పుడు నీ కృపను చూసి అర్థము చేసుకోలేను. ఈ సూక్ష్మ విషయాన్ని నీవే నీ కృపతో వివరించాలి.   

ముప్పై తొమ్మిదవ పాశురము: మునుపటి పాశురములో ఎంబెరుమానార్ నుండి తన ప్రశ్నకు ప్రతిస్పందన రాలేదని అముదనార్లు, ఆ విషయము అలా పక్కన పెట్టి, ఎంబెరుమానార్ తనకు చేసిన ఉపకారాల గుర్తుచేసుకుంటారు, “ఇటువంటి రక్షణ కార్యాలు ఇంకెవరు చేస్తారు?” అని అముదనార్ తన మనస్సుకి చెప్పుకుంటున్నారు. 

పారుళుం పుదల్వరుం పూమియుం। పూంగుళలారుం ఎన్ఱే 
మరుళ్‌ కొండు ఇళైక్కుం। నమక్కు నెంజే* మఱ్ఱు ఉళార్  తరమో
ఇరుళ్‌ కొండ వెన్ తుయర్‌ మాఱ్ఱి। త్తన్ ఈఱిల్‌ పెరుం పుగళే।
తెరుళుం తెరుళ్‌ తందు। ఇరామానుశన్ శెయ్యుం శేమంగళే॥ (39)

భార్య పిల్లలు, ఐశ్వర్యము వంటి వ్యర్థమైన లౌకిక విషయాలలో మేము బాధపడుతున్నాము. అజ్ఞానముతో ఉద్భవించిన దుఃఖాలను ఎంబెరుమానార్ తొలగించి వారి నిత్యమైన అనంతమైన దివ్య మంగళ గుణాలను తెలిసుకునేలా జ్ఞానాన్ని ఇచ్చారు. ఓ మనసా! వారి రక్షణ చర్యలు కూడా ఇతరుల రక్షణ చర్యలలా అల్పమైనవా? 

నలభైవ పాశురము: ఈ ప్రపంచానికి రామానుజులు చేసిన మహోపకారములను స్మరిస్తూ అముదనార్ మహదానంద పడుతున్నారు.

శేమ నల్‌ వీడుం। పారుళుం తరుమముం। శీరియ నల్‌
కామముం। ఎన్ఱు ఇవై నాంగు ఎన్బర్* నాంగినుమ్ కణ్ణనుక్కే
ఆమదు కామం। అఱమ్ పొరుళ్‌ వీడిదఱ్కు ఎన్ఱు ఉరైత్తాన్।
వామనన్ శీలన్। ఇరామానుశన్ ఇంద మణ్మిసైయే॥ (40)

ప్రతిఫలమాశించక ఇతరుకు సహాయాన్ని అందించే శ్రీ వామనుడిని పోలిన వారు ఎంబెరుమానార్.  ధర్మ, అర్థ, కామ, మోక్షాలు మనము సాధించవలసినవి అని మన జ్ఞానులైన పెద్దలు అంటారు. ఇందులో, భగవాన్ పట్ల మన ప్రేమని కామముగా గుర్తిస్తారు. ఈ ప్రపంచములో ధర్మము మన పాపాలను తొలగిస్తుందని ఎంబెరుమానార్ కృపతో తెలుపుతున్నారు. దానములతో అర్థము, మన ధర్మానికి పరిపూర్ణత చేకూరుస్తుంది. భగవత్ కామముతో (భగవత్ ప్రీతి)  వీటన్నిటితో, మన మోక్ష సాధనము వృద్ది అవుతుంది.  

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-31-40-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 21- 30

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< పాశురములు 11- 20

ఇరవై ఒకటవ పాశురము: ఆళవందారుల దివ్య తిరువడి ఉపాయముగా  పొందిన ఎంబెరుమానార్లు, కృపతో నన్ను రక్షించెను. అందుచేత అంత కంటే తక్కువ వారిని నేను కీర్తించను.

నిదియై ప్పొళియుం ముగిల్‌ ఎన్ఱు । నీశర్‌ తం వాశల్‌ పత్తి
తుది కత్తులగిల్।‌ తువళ్గిన్ఱిలేన్* ఇని తూయ్‌ నెఱి శేర్
ఎదిగట్కిఱైవన్ యమునై  తుఱైవన్ ఇణై అడియాం। 
గది పెత్తుడైయ । ఇరామానుశన్ ఎన్నై క్కాత్తననే॥ (21)

దివ్య పాదయుగళి గల ఆళవందార్లు, స్వచ్ఛమైన కార్యములు చేసే యతులకు రాజు వంటివారు. ఆళవందార్ యొక్క దివ్య తిరువడియే తన ఉపాయముగా ఉన్న ఎంబెరుమానార్లు కృపతో నన్ను రక్షించారు. కావున, అల్పుల ఇంటి గుమ్మాల వద్ద వారి గొప్పతనాన్ని పొగుడుతూ ” నీవు సంపదను కురిపించే మేఘము వంటి వాడవు” అని ప్రసంసిస్తూ వారిని నా రక్షణార్థం ఆశ్రయించను.

ఇరవై రెండవ పాశురము:  బాణాసురుని పక్షాన చేరి తననే విరోధించిన దేవతల వైపరిత్యాన్ని భగవానుడు సహించాడు. ఆపై ఎంబెరుమాన్ యొక్క గొప్ప తనాన్ని గ్రహించి వారిని కీర్తించారు. ఎంబెరుమాన్ ని ప్రశంసించే ఎంబెరుమానార్లు, నన్ను ఆపదలో నుండి రక్షించిన గొప్ప నిధి వంటివారు.

కార్‌త్తిగైయానుం । కరి ముగత్తానుం । కనలుం ముక్కణ్‌
మూర్‌త్తియుం మోడియుం వెప్పుం ముదుగిట్టు  మూవులగుం
పూత్తవనే  ఎన్ఱు పోత్తిడ । వాణన్ పిళై పొఱుత్త ।
తీరత్తనై ఏత్తుం । ఇరామానుశన్‌ ఎందన్ శేమ వైప్పే ॥ (22)

శ్రీ కృష్ణపరమాత్మకు విరోధముగా యుద్దము చేస్తూ బాణాసురునికి సహాయంగా నిలబడ్డ కార్తికేయుడు, గణపతి, అగ్ని దేవుడు, త్రినేత్రుడైన శివుడు, దుర్గ, జ్వరుడు యుద్ధ భూమినుండి పారిపోయిరి. శ్రీ కృష్ణపరమాత్మ మహోన్నతుడని గ్రహించిన దేవతలు “ముల్లోకాలను నీ దివ్య కమలనాభిలో  నుండి సృష్థించావు” అని కీర్తిస్తూ బాణాసుడి తరఫున దేవతలు భగవానుడిని వేడుకున్నారు. వారి కోరిక మేరకు బాణాసురుడిని భగవాన్ క్షమించి వదిలేస్తాడు. అటువంటి మహోన్నతుడైన భగవాన్ యొక్క దివ్య మంగళ గుణాలను కీర్తించే ఎంబెరుమానార్, నా ఆపత్కాలములో నన్ను గట్టెక్కించే ఒక నిధి లాంటివాడు.

ఇరవై మూడవ పాశురము: “ఏ లోపములు లేని వారిచే కీర్తించబడే ఎంబెరుమానార్లని అన్ని లోపాలతో కూడిన నేను కీర్తిస్తే వారి మంగళ గూణాలు ఏమౌతాయి?” అని అముదనార్లు ప్రశ్నిస్తున్నారు.

వైప్పాయ వాన్ పొరుళ్‌ ఎన్ఱు । నల్‌ అన్నర్‌ మనత్తగత్తే
ఎప్పోదుం వైక్కుం । ఇరామానుశనై ఇరు నిలత్తిల్‌
ఒప్పార్‌ ఇలాద । ఉఱు వినైయేన్ వంజ నెంజిల్‌ వైత్తు ।
ముప్పోదుం వాళ్‌త్తువన్ । ఎన్నాం ఇదు అవన్ మొయ్‌ పుగళ్ ‌క్కే॥ (23)

మన సంపదను రాత్రింబగళ్ళు తేడా లేకుండా ఎలా జాగ్రత్త పరుచుకొంటామో అలాగే ఏ దోషము కల్మశము లేని వారు ఎంబెరుమానార్లని ప్రేమతో తమ గుండెలలో నిలుపుకొంటారు. పరమ పాపులకు సమానుడనైన నా లాంటివాళ్ళు అటువంటి ఎంబెరుమానార్లని తమ మనస్సులో పెట్టుకొని రోజుకి మూడు  సార్లు వారిని స్తుతిస్తుంటే వారి గొప్పతనం ఏమి కావాలి?

ఇరవై నాల్గవ పాశురము: తక్కువ స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎలా వచ్చారని అడిగినపుడు, అముదనార్లు తన మునుపటి స్థితి నుండి ఇక్కడి వరుకు ఎలా వచ్చారో వివరిస్తున్నారు.

మొయ్‌త్త వెమ్ తీవినైయాల్ । పల్లుడల్‌ తొఱుం మూత్తు । అదనాల్‌
ఎయ్‌త్తొళిందేన్ । మున నాళ్లళ్‌ ఎల్లాం * ఇన్ఱు కణ్డు ఉయర్‌ందేన్‌
పాయ్‌ త్తవం పోత్తుం పులై చ్చమయంగళ్‌ నిలత్తవియ
క్కైత్త మెయ్ ఞ్ఙానత్తు । ఇరామానుశన్ ఎన్నుం కార్‌ తన్నైయే ॥ (24)

తేనెపుట్ట చుట్టూ తేనెటీగలు గుముగూడినట్లు, అనాదిగా క్రూరమైన నా గత  కర్మలు నా ఆత్మ చుట్టూ గుముగూడి ఉండగా, దాని ఫలితముగా మళ్ళీ మళ్ళీ పుట్టి ముసలితనాన్ని అనుభవిస్తున్నాను. వేదములు మనకు ఈ లౌకిక సుఖాలకి ఎలా దూరముండాలో, ఎవరికీ హాని కలిగించకూడదని చూపిస్తాయి, చివరికి గురువులను ఎలా సేవించాలో మార్గదర్శకత్వము చేస్తాయి. అల్పమైన తత్వ శాస్త్రములు వేదానుసారముగా కాకుండా వారి సొంత భుద్దిని ఉపయోగిస్తూ తప్పుగా ప్రవర్తిస్తాయి. అటువంటి తత్వ శాస్త్రములను ఎంబెరుమానార్లు ఖండించారు. అత్యంత ఉదారస్వభావులైన అటువంటి  ఎంబెరుమానార్లు, వారి నిజరూపాన్ని తనుకు చూపించినందుకు తాను ఇప్పటి ఈ ఉన్నత స్థితికి చేరుకున్నాను అని అముదనార్లు తెలుపుతున్నారు.

ఇరవై ఐదవ పాశురము: తనకు చేసిన ఉపకారములను గుర్తుచేసుకుంటూ, అముదనార్లు రామానుజుల దివ్య ముఖాన్ని చూస్తూ వారిని ఇలా అడుగుతున్నారు, “ఈ ప్రపంచములో నీ కృపను ఎవరు తెలుకోగలరు?”

కారేయ్‌ కరుణై ఇరామానుశ । ఇక్కడలిడత్తిల్‌
ఆరే అఱిబవర్।  నిన్ అరుళిన్ తన్మై *  అల్లలుక్కు
నేరే ఉఱైవిడం నాన్‌ వందు నీ ఎన్నై ఉయ్‌త్త పిన్  ఉన్‌
శీరే ఉయిర్‌క్కుయిరాయ్ । అడియేర్కు ఇఱు తిత్తిక్కుమే ॥ (25)

ఎలాగైతే నేల సముద్రము తేడా లేకుండా మేఘము అన్ని చోట్లా వర్షిస్తుందో, అలాగే ఏ భేదము లేకుండా అందరిపైన తన కృపా వర్షాన్ని కురిపించే ఓ రామానుజా! నేను అన్ని దుఃఖాలకు ఆధారము లాంటివాడినైనా  ఇటువంటి సమయాన నీవైనీవు వచ్చి నాకు ఆశ్రయమునిచ్చావు, నీ పరిశుద్దమైన కళ్యాణ గుణాలు ఈ ఆత్మను నిలబెట్టేందుకు మధువు లాంటిది. నీ కృపను గుర్తించేవారు ఈ ప్రపంచములో ఎవరు ఉన్నారు?

ఇరవై ఆరవ పాశురము: ఎంబెరుమానార్ల దివ్య తిరువడి సేవలో తమను సంపూర్ణముగా అర్పించుకున్న ప్రఖ్యాతి శ్రీవైష్ణవులకుంది. అటువంటి శ్రీవైష్ణవుల పూర్వపు స్థితిలోని ప్రతి గుణము నన్ను ముగ్ధుడను చేస్తున్నది అని అముదనార్లు తెలుపుతున్నారు.

తిక్కుత్త కీర్‌త్తి ఇరామానుశనై । ఎన్‌ శెయ్‌ వినైయాం । 
మెయ్‌ క్కుత్తం నీక్కి । విళంగియ మేగత్మై * మేవుం నల్లోర్‌
ఎక్కుత్త వాళర్‌ ఎదు పిఱప్పు ఏదు ఇయల్వు ఆగ నిన్నోర్ ।
అక్కుత్తం అప్పిఱప్పు । అవ్వియళల్వే నమ్మై ఆట్కొళ్యుమే॥ (26)

నేను చేసిన తప్పుడు పనుల కారణముగా నాలో స్థిరమై ఉన్న లోపాలను ఎంబెరుమానార్లు తొలగించారు. ఆ నా పాపాలు తొలగినందున కలిగిన సంతోషము కారణముగా వారి ఔదార్య గుణములు నలుమూలలు వ్యాపించి అద్భుతంగా నిలబడిరి.  రామానుజుల దివ్య పాదాలతో నీడలా వెంట ఉన్న గొప్ప వాళ్ళు కూడా పూర్వము కొన్ని అప్పిదాలు చేసి ఉండవచ్చు, తక్కువ జాతిలో పుట్టి ఉండవచ్చు, కొన్ని దుష్కర్మలు చేసి ఉండవచ్చు. అటువంటి లోపాలు, జన్మలు, కర్మలు మాత్రమే ‘ఎవరైనా ఎంబెరుమానార్లని చేరుకోగలరు’ అని భావించే మాలాంటివారిని కూడా పాదాక్రాంతులను చేయగలవు. అటువంటి ఆలోచన వచ్చినపుడు, శ్రీవైష్ణవులు మనలాంటి సామాన్యులు కారని మనకంటే ఎంతో ఉన్నతమైన వారని భావిస్తాము.

ఇరవై ఏడవ పాశురము: ఎంబెరుమానార్లు తమ దాసుల పట్ల ఆప్యాయతతో  ఉన్న రీతిన, తన మనస్సుతో కూడా సంబంధితులైనారు. ఎంబెరుమానార్లకి ఏ దోషము అంటుకుంటుందోనని అముదనార్లు కలవరపడుతున్నారు.

కొళ్ళ క్కుఱైవత్తిలంగి । కొళ్ళుందు విట్టు ఓంగియ ఉన్‌
వళ్ళల్‌ తనత్తినాల్ । వల్వినైయేన్ మనం నీ పుగుందాయ్
వెళ్ళై చ్చుడర్‌ విడుం ఉన్ పెరు మేన్మైక్కు ఇళుక్కు ఇదు ఎన్టు ।
తళ్ళుత్తు ఇరంగుం । ఇరామానుశ  ఎన్ తని నెంజమే ॥  (27)

ఓ ఉడైయవర్ (ఉభయ విభూతులూ తన నియంత్రణలో ఉన్నవాడు)! కోరుకున్న వారందరికీ వారి వారి కోరికలు తీర్చినందుకు నీ గొప్పతనము అపరిమితముగా అద్భుతంగా విస్తృతమైనది. అటువంటి నేను ఒక పాపినైనా నీ గొప్పతనాన్ని కూడా లెక్క చేయకుండా నా మనస్సులోకి ప్రవేశించావు. ఒంటరిదైన నా మనస్సు పవిత్రమైన నీ గొప్పతనానికి కొఱత ఏర్పరుస్తుందేమోనని భావించి కృంగిపోవుచున్నది అని అముదనార్ వివరిస్తున్నారు.

ఇరవై ఎనిమిదవ పాశురము:  ఎంబెరుమానార్లు  వ్యవహారాల పట్ల తన వాక్చాతుర్య కోరికను చూసి అముదనార్లు ఆనంద పడుతున్నారు.

నెంజిల్‌ కఱై కొండ । కంజనై క్కాయ్‌ంద నిమలన్ । నంగళ్‌
పంజి త్తిరువడి । ప్పిన్నై తన్ కాదలన్ * పాదం నణ్ణా
వంజర్‌ క్కరియ ఇరామానుశన్ పుగళ్‌ అన్ది ఎన్ వాయ్।
కొంజి ప్పరవగిల్లాదు । ఎన్న వాళ్వు ఇన్ఱు కూడియదే ॥ (28)

అటు చూస్తే మనస్సులో కోపాన్ని పెంచుకున్న కంసుడిపై శ్రీ కృష్ణుడు ఆగ్రహించాడు, కానీ ఇటు చూస్తే దాసుల తప్పిదముల పట్ల అమితమైన వాత్సల్యము చూపించి, మెత్తని దూదిలాంటి పాదాలున్న నప్పిన్నై పిరాట్టి (నీళా దేవి) వారికి అతి ప్రియమైనవాడు. తమ ఆత్మలను దొంగిలించి (ఆత్మ తమ సొంతమని భావించేవారు) శ్రీ కృష్ణపరమాత్మ తిరువడిని ఆశ్రయించని వారు ఎంబెరుమానార్ల ని పొందలేరు. నా వాక్కు ఎంబెరుమానార్ల యొక్క కళ్యాణ గుణాలను తప్ప ఇంకెవ్వరినీ కీర్తించదు. ఎంత అద్భుతమైనదో కద ఇప్పుడున్న ఈ జీవితము.

ఇరవై తొమ్మిదవ పాశురము: ఎంబెరుమానార్లు యొక్క మంగళ గుణాలను గ్రహించి తండొపతండాలుగా  చేరిన గుంపుని చూసే అదృష్థము ఈ కన్నులకి ఎప్పుడు కలుగుతుందని అముదనార్లు ఆశ్చర్యపోతున్నారు.

కూట్టుం విది ఎన్ఱు కూడుంగొలో । తెన్ కురురై ప్పిరాన్‌
పాట్టెన్నుం వేద ప్పశుందమిళ్‌ తన్నై * త్తన్ పత్తి ఎన్నుం
వీట్టిన్ కణ్‌ వైత్త ఇరామానుశన్ పుగళ్‌ మెయ్‌ ఉణర్‌ందోర్ ।
ఈట్టింగళ్‌ తన్నై । ఎన్ నాట్టంగళ్‌ కండిన్నం ఎయ్దిడవే॥ ( (29)

ఆళ్వార్ తిరునగరికి నాయకుడైన నమ్మాళ్వార్ రచించిన వేద రూపములో ఉన్న తిరువాయ్మొలి, చాలా ప్రశస్తి కలిగినది. ఎంబెరుమానార్లు ఆ తిరువాయ్మొలిని తన హృదయంలో ఉంచుకున్నారు.  ఎంబెరుమానార్లు యొక్క కళ్యాణ గుణాలను గ్రహించి తడొపతండాలుగా  చేరిన గుంపుని చూసే అదృష్థము ఈ కన్నులకి ఎప్పుడు కలుగుతుందని? ఈ మేలును గ్రహించేందుకు మనపై వారి కృపా వర్షము ఎప్పుడు కురుస్తుందో?

ముప్పైయ్యవ పాశురము:  ఎంబెరుమానార్లని మొక్షము ప్రసాదించమని అడిగారా లేదా అని ప్రశ్నించినపుడు, ఎంబెరుమానార్లు తనను వారి ఆశ్రయములోని తీసుకున్న తరువాత తాను మోక్షాన్ని పొందినా పరవాలేదు, నరకాన్ని పొందినా పరవాలేదు అని అముదనార్లు తెలియజేస్తున్నారు.

ఇన్చం తరు పెరు వీడు వందు ఎయ్దిలెన్ । ఎణ్ణిఱంద
తున్చం తరు । నిరయం పల శూళ్లిలెన్ * తొల్‌ ఉలగిల్
మన్ పల్‌ ఉయిర్లట్కిఱైవన్ । మాయనెన మొళ్లింద
అన్నన్ అనగన్ । ఇరామానుశన్ ఎన్నై ఆండననే ॥ (30)

అద్భుతమైన స్వరూప, రూప గుణాలున్న సర్వేశ్వరుడు, అనాదిగా ఈ సంసారములో  చిక్కుకొనున్న అసంఖ్యాక ఆత్మలకు అధిపతి. ఈ సత్యాన్ని ఎంబెరుమానార్లు సంసారుల పట్ల తమ నిష్కామ కృపతో అందించిన “శ్రీభాష్యం” గ్రంథము ద్వారా మనందరికీ తెలియజేశారు. అటువంటి ఎంబెరుమానార్ ఎంతో దయతో వారి శిష్యునిగా స్వీకరించిన తరువాత ఎంబెరుమాన్ నిత్య కైంకర్యము కొనసాగించేందుకు మోక్షాన్ని పొందినా పరవాలేదు లేదా లెక్కలేనన్ని వేదనలు చుట్టు ముట్టి ఉన్న నరకమును పొందినా పరవాలేదు. నాకు రెండూ సమానమే.

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-21-30-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org