Daily Archives: December 6, 2020

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 62 – 63

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 62

ఈ పాశురములో పరమపదమును సులభముగా ఏవిధంగా పొందవచ్చునో తెలుపుచున్నారు.

ఉయ్యనినై వుణ్డాగిల్ ఉజ్ఞ్గురుక్కళ్ దమ్ పదత్తే వైయుమ్* అన్బుతన్నై ఇన్ద మానిలత్తీర్ మెయ్యురైక్కేన్| పైయరవిల్ మాయన్ పరమపదమ్ ఉజ్ఞ్గుళుక్కామ్! కైయిలజ్ఞ్గు నెల్లిక్కని||

ఈ విశాలమైన ప్రపంచమనబడే సంసార జగత్తు నందు ఉన్న జనులారా! ఉజ్జీవించాలనే కోరికయున్నచో దానికి సులభ మార్గమును నేను చెప్పుచున్నాను వినండి! మీయొక్క ఆచార్యుల తిరువడిగళ్ళను పట్టుకొనియుండినచో మాయావియైన ఎంబెరుమాన్ యొక్క నివాస స్థానమైన పరమపదము కరతలామలకము (అరచేతిలోని ఉసిరిక) వలే సులభముగా లభించును. ఇది సత్యము.
ఆచార్య సంబంధము కలిగి ఉండి అట్టి ఆచార్యుని యందు భక్తి ఉన్న “మీకు” ఇది అనువర్తించును. ఇదే లోక ప్రశస్తి. భరతాళ్వాన్ యందు భక్తిని కలిగియుండిన శతృఘ్నునకు రాముని యందు కూడా భక్తియుండినటులే. ఆచార్య భక్తి ఉన్నచో వారికి ఎంబెరుమాన్ యందు కూడా భక్తి ఉన్నట్లే. అదే విధముగా ఆయనను పొందుట చాలా సులభము. మణవాళ మామునుల దోషరహిత ఈ తిరువాక్కుల యందు సందేహమునకు ఏ మాత్రము స్థానము లేదు.

పాశురము 63

ఈ పాశురములో ఆచార్యులు చేయు మహోపకార్యములను దానికి శిష్యుడు కృతజ్ఞుడై ఉండుట గూర్చి కృప చేయుచున్నారు.

ఆశారియన్ శెయ్ద ఉపకారమ్ ఆనవదు| తూయ్దాగ నెఞ్జుదన్నిల్ తోన్ఱుమేల్* తేశాన్తరత్తిల్ ఇరుక్క మనమ్ దాన్ పొరున్ద మాట్టాదు ఇరుత్తల్ ఇవి ఏదు అఱియోమ్ యామ్||

ఆచార్యులు చేయు ఉపకారములు దోషరహితములని శిష్యుడు తన మనస్సు నందు తలచినచో ఆచార్యునకు కైజ్ఞ్కర్యము చేయుట యందే ఆశ కలిగి ఉండాలి. కాని కొందరు ఆచార్య కైజ్ఞ్కర్యము చేయగలిగియూ చేయకుండుట నాకర్థము కావుటలేదని చెప్పుచున్నారు.

ఆచార్యులు శిష్యునకు చేయు ఉపకారములు జ్ఞానమును ప్రసాదించుట, దోషములు/పాపములు చేయకుండ నిలువరించుట, కైజ్ఞ్కర్యముల యందు ఆశ కలిగి యుండుట, మోక్షమును పొందుట యందు ఉపకారకుడుగా ఉండుట మొదలగునవి. మంచి శిష్యుడైన వారు వీటినన్నిటినీ తలచుకొనుచు ఎల్లవేళలా ఆచార్యుని యందు కృతజ్ఞుడై ఆచార్య కైజ్ఞ్కర్యము చేయుట యందే ఆశ కలవాడై ఉండాలి. మామునులు కూడా వారి ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై ఈ లోకములో జీవించి ఉన్నంతవరకు ఆళ్వార్ తిరునగరిలోనే ఉండి తమ ఆచార్యునికి ఇష్ట కైజ్ఞ్కర్యములు చేసినారు. తిరువాయ్మొళి  పిళ్ళై తిరునాడు (పరమపదము)ను పొందిన/వేంచేసిన పిదప వీరు శ్రీరంగమునకు విజయము చేసినారు. ఆ విధముగా వీరు ఆచరించినదే ఇతరులకు ఉపదేశించినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-62-63-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకము 1-10

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

స్తోత్ర రత్నము

<< తనియన్లు

శ్లోకము 1 – ఈ మొదటి శ్లోకములో,  నిజమైన నిధియైన జ్ఞాన వైరాగ్యములయందున్న నాథమునుల సమర్థతని ఆళవందారులు నమస్కరిస్తున్నారు.

నమోऽచింత్యాధ్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే।
నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సిన్ధవే॥

లోతైన భగవద్భక్తి  సాగరము వంటివారు, భగవత్ అనుగ్రహం తో ఊహకందని అద్భుత జ్ఞాన వైరాగ్యములు కలిగి, ఎల్లప్పుడూ భగవత్ ధ్యానం లో ఉండే నాథమునులకు  నా నమస్కారములు.

శ్లోకము 2 – ఈ శ్లోకములో, భగవద్ అవతారముల గురించి నాథమునులకున్న ఉన్నత జ్ఞానానికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. అలాగే, “వారి జ్ఞానము మొదలైనవి (మునుపటి శ్లోకములో వివరించబడింది) వారితోనే పరిమితము కాకుండా,  పొంగి నా (ఆళవందారుల) వరకు ప్రవహించుచున్నది”  అని వివరిస్తున్నారు.

తస్మై నమో మధుజిదంఘ్రిసరోజతత్త్వ
జ్ఞానానురాగ మహిమాతిశయాంతసీమ్నే।
నాథాయ నాథమునయేऽత్ర పరత్ర చాపి
నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం॥

మధువనెడి రాక్షసుడిని వధించిన ఎంబెరుమాను యొక్క దివ్య చరణకమలముల వద్ద సత్ జ్ఞాన భక్తికి పరాకాష్ట అయిన  నాథమునుల దివ్య తిరువడియే నిరంతరము ఈ లోకములో మరియు పర లోకములలో కూడా నాకు ఆశ్రయము, అటువంటి నాకు స్వామియైన శ్రీమన్నాథమునులకు నా నమస్కారాలు.

శ్లోకము 3 –   దప్పికతో ఉన్న మనిషి  దాహము మార్చి మార్చి ఎన్ని నీళ్ళు త్రాగినా తీరనట్టుగా, “నేను మళ్ళీ మళ్ళీ  వారి దాసుడిని” అని ఆళవందారులు తెలుపుతున్నారు.

భూయో నమోऽపరిమితాచ్యుత భక్తితత్వ
జ్ఞానామృతాబ్ధి పరివాహ శుభైర్వచోభిః ।
లోకేऽవతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి
యోగాయ నాథమునయే యమినాం వరాయ॥

భక్తి యోగ సాధకులు, యోగులలో ఉత్తములు, సంపూర్ణులు, అత్యుత్తమ ఉపకారకులు, ఉత్తమ జ్ఞానము మరియు అనంత భగవత్భక్తి సాగరము నుండి పొంగిన శుద్ద సత్వ వాక్కుల/పదముల రూపములో ఈ భూమిపైన అవతరించిన నాథమునులకు మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.

శ్లోకము 4 –  విష్ణు పురాణము రూపంలో తనకి సహకారమందించిన శ్రీ పరాశర భగవాన్ కి ఆళవందారులు నమస్కరిస్తున్నారు.

తత్త్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ
భోగాపవర్గ తదుపాయగతీరుదారః।
సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం
తస్మై నమో మునివరాయ పరాశరాయ॥

చిత్(చేతనులు), అచిత్(అచేతనులు) మరియు ఈశ్వర(భగవాన్) గురించి, వాటి స్వభావములు గురించి, సుఖము (లౌకిక సుఖము), మొక్షము మరియు మొక్ష సాధనముల గురించి, జీవాత్మలందరూ సాధించ వలసిన లక్ష్యము గురించి విసృతముగా వివరించే పురాణములన్నింటిలో మణి వంటిదైన శ్రీవిష్ణుపురాణమును మనకందించిన ఋషులలో ఉత్తముడైన పరాశర ఋషికి నా వందనాలు.

శ్లోకము 5 –  నమ్మాళ్వార్ల దివ్య చరణాల చెంత చేరి ఆళవందారులు వారికి శరణాగతి చేస్తున్నారు.

మాతా పితా యువతయస్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానాం।
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ॥

నమ్మాళ్వారుల దివ్య చరణాలు ఎల్లప్పుడూ నా వంశస్థులకు తల్లి, తండ్రి, స్త్రీ (భార్య), సంతానము, సంపద, సమస్థము (ఇక్కడ ప్రస్తావించనివి). శ్రీవైష్ణవ శ్రీతో (కైంకర్య సంపద) , వకుళ పుష్పాలంకరణతో ఉన్నటువంటి వైష్ణవ కులాధిపతి అయిన ఆళ్వార్లని  నా శిరస్సు వంచి ఆరాధిస్తాను.

శ్లోకము 6 – తిరువాయ్మొళి 7.9.7 “వైగుందనాగ ప్పుగళ” (ఆళ్వార్ చే శ్రీవైకుంఠ నాథుడని భగవాన్ పొగిడించుకుంటున్నారు), ఎందుకనగా పొగడ్తలు వారికి (ఈశ్వర) ఇష్టము కనుక మరియు భగవానున్ని పొగడటం/కీర్తించడం ఆచార్యులకు ఇష్టము, అందువలన వారిని కీర్తించాలనే ఉద్దేశ్యముతో ‘ఉపాయము’ మరియు ‘ఉపేయము’ గురించి క్లుప్త వివరణ ఇస్తూ భగవాన్ ని కీర్తించడం మొదలుపెడుతున్నారు.

యన్మూర్ధ్ని మే శృతిశిరస్సు చ భాతి యస్మిన్
అస్మన్మనోరథపథః సకలః సమేతి।
స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్
పాదారవిందం అరవిందవిలోచనస్య॥

వేదాంతములలో మరియు  నా శిరస్సుపై కనబడే ఆ దివ్య చరణములు మనకు కులదైవము మరియు వంశానికే సంపదలాంటివి. ఎవరి దివ్య పాదాలయందు పొంగి పొర్లుతున్న మన ప్రేమ అందంగా చేరుతుందో ఆ పుండరీకాక్షుని (కమల నేత్రములు కలవాని) దివ్య చరణ కమలములను నేను కీర్తించెదను.

శ్లోకము 7 –  శ్రీ భగవద్గీత 1.47 లో “విసృజ్య సశరం చాపం” అని ఉపదేశించబడింది, యుద్దభూమిలో అర్జునుడు తన గాండీవాన్ని క్రింద పెట్టి తాను యుద్దము చేయనని నిశ్చయించుకున్నట్టుగా  ఆళవందారులు తన ప్రయత్నానాన్ని విరమించుకుంటారు.

తత్వేన యస్య మహిమార్ణవశీకరాణుః
శక్యో న మాతుమపి సర్వపితామహాద్యైః।
కర్తుం తదీయమహిమస్తుతిముద్యతాయ
మహ్యం నమోऽస్తు కవయే నిరపత్రపాయ॥

బ్రహ్మ రుద్రాదులు ఎంబెరుమాన్ యొక్క విశాల ఔన్నత్య సాగరములోని చిన్న బిందువులోని ఒక అణువు మాత్రాన్ని కూడా కొలవ సాధ్యము కాదు. నన్ను నేను కవిగా చాటుకుంటూ అటువంటి ఎంబెరుమాన్ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తానని సిగ్గుపడకుండా బయలుదేరిన నన్ను నేను నమస్కరించుకోవాలి.

శ్లోకము 8 – యుద్ధభూమిలో తన గాండీవాన్ని క్రింద పెట్టి తాను యుద్ధము చేయనని నిశ్చయించుకున్న అర్జునుడిని ఈశ్వరుడు శ్రీ భగవద్గీత లో 18.73 “కరిష్యే వచనం తవ” (నీవు చెప్పినట్లు నేను యుద్దము చేసెదను) ప్రేరేపించినట్టుగా, ఇక్కడ ఆళవందారులను ప్రొత్సహిస్తూ ఇలా తెలుపుతున్నారు “నోరున్నది కేవలము కీర్తించడానికే; శ్రీ విష్ణు సహస్రనామములో ‘స్తవ్యః స్తవప్రియః’ (అతను ప్రశంసనీయుడు మరియు ప్రశంస ప్రియుడు), ప్రశంసించబడటం నాకు అతిప్రియము”. ఇది విన్న ఆళవందారులు భగవాన్ ని ప్రశంసించడానికి ఏకీభవిస్తారు.

యద్వా శ్రమావధి యథామతి వాప్యశక్తః
స్తౌమ్యేవమేవ ఖలు తేऽపి సదా స్తువంతః।
వేదాశ్చతుర్ముఖ ముఖాశ్చ మహార్ణవాంతః
కో మజ్జతోరణుకులాచలయోర్విశేషః॥

లేదా, అలసిపోయేవరకు ఈ అసమర్ధుడికి తెలిసినంతవరకు నిన్ను కీర్తిస్తాను; ఈ తీరులో వేదములు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనవారు కూడా ఆ సర్వేశ్వరుడిని పొగిడారు; కానీ విశాల సాగరములో మునిగే ఒక చిన్న అణువుకి పెద్ద పర్వతానికి మధ్య తేడా ఏముంది?

శ్లోకము 9 – ఈ శ్లోకములో, భగవాన్ని కీర్తించుటలో తాను బ్రహ్మ కంటే ఎక్కువ అర్హత కలవాడినని ఆళవందారులు తెలుపుతున్నారు.

కించైష శక్త్యతిశయేన న తేऽనుకంప్యః
స్తోతాऽపి తు స్తుతి కృతేన పరిశ్రమేణ।
తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః
ఇత్యుద్యమోऽయముచితో మమ చాప్జనేత్ర॥

నిన్ను స్తుతించగల సామర్థ్యము నాకు కలదని, ఆ కారణముగా నీ కృపా వర్షానికి నేను అర్హుడను కాను; కానీ నిన్ను స్తుతించి అలసినందుకు నీ కృపా వర్షానికి అర్హుడను; ఈ స్థితిలో, అల్ప జ్ఞానిని కాబట్టి త్వరగా అలసిపోతాను; కావున, ఈ ప్రయత్నము నాకు సరైనది (బ్రహ్మ మొదలైనవారితో పోలిస్తే).

శ్లోకము 10 –   భగవానుని కీర్తించుటను మొదట విరమించుకొని ఆ తరువాత ఒప్పుకున్న ఆళవందారులు, ఎంబెరుమాన్ యొక్క పరత్వమే తనకి ఆశ్రయము అని తరువాతి ఐదు శ్లోకములలో వివరిస్తున్నారు. ఇందులోని మొదటి శ్లోకములో, కృపతో ఆళవందారులు కారణ వాక్యాలతో (భగవానుడే మూలమని ఘోషించే శాస్త్రములోని కొన్ని గద్యములు) భగవాన్ యొక్క ఆధిపత్య గుణ వివరణను అందిస్తున్నారు.

నావేక్షసే యది తతో భువనాన్యమూని
నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తిః।
ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతోః
స్వామిన్ న చిత్రమిదం ఆశ్రిత వత్సలత్వం॥

ఓ భగవంతుడా! ప్రళయము పిదప నీవు కరుణతో నీ కృపా దృష్టి వెదజల్లకపోయి ఉంటే, ఈ లోకాలు సృష్టింపబడి ఉండేవి కాదు; ఎటువంటి చలనమూ ఉండేది కాదు (ప్రారంభ దశలో లోకాలు సృష్టింపబడి ఉండకపోతే). ఓ భగవాన్! ఈ విధముగా, నీవు సమస్త జీవులకు మిత్రుడిగా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా నీ భక్తుల పట్ల మాతృ వాత్సలయం చూపటం లో వింతలేదు.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-1-10-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org