ఉత్తర దినచర్య శ్లోకం 6 – ఉన్మీల

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 4 & 5

శ్లోకం 6

శ్లోకము

“ ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతితల ముపరి క్షీరసంగాత గౌరం

రాగ చంద్ర ప్రకాశ ప్రచురనఖమణి ద్యోత విద్యోత మానమ్ !

అజ్ఞుల్యగ్రేషు కిఞ్చిత్ నతమతి మృదులం రమ్యజామాతృయోగీ

దివ్యం తత్పాదయుగ్మం దిశతు శిరసి మే దేశికేంద్రో దయాళుః !!

ప్రతిపదార్థము :

దయాళుః = కరుణ పొంగు గుణము కలవారైన

దేశికేంద్రః = ఆచార్యులలో ఉన్నతులైన

రమ్యజామాతృయోగీ = రమ్యమైన దేహసౌందర్యముకలిగివున్న అళగీయ మణవాళ మామునులు

ఉన్మీల గర్భ ద్యుతితలం = అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మములోపల ఉండే లేత ఎరుపురంగు వంటి కాంతితో నిండిన అరిపాదాలు

ముపరి = పాద పైభాగంలో

క్షీర సంగాత గౌరం = చిక్కటి పాల వంటి కాంతితో కూడిన రంగులో

రాగ చంద్రప్రకాశ ప్రచుర నఖమణి ద్యోత విద్యోత మానం = పున్నమి నాటి చంద్రకాంతిని పోలిప్రకాశిస్తున్న నఖములు

అజ్ఞుల్యగ్రేషు = నఖములు అంచులు

కిఞ్చిత్ నతం = కొద్దిగా వంగి వుండి

అతి మృదులం = చాలా మృదువుగా

దివ్యం = అప్రాకృతమైన

తత్ = ఉన్నతమైన

పాదయుగ్మం = పదముల జంట

మే శిరసి = దాసుడి తలపై

దిశతు = ఉంచి అనుగ్రహించాలి

భావము:

ప్రస్తుత శ్లోకము నుండి వరుసగా ఆరుశ్లోకములు శిష్యులు స్తోత్రం చేస్తున్నట్లుగా అమరి ఉన్నవి. ఈ శ్లోకములో ఒక శిష్యుడు తన తలకు ఆభరణంగా మామునుల శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించాలని కోరుతున్నాడు.

దయాళుః…….దయను చూపడం అనేది వారికి సహజ సిద్దమైన గుణము.  శిష్యులు సేవచేస్తే వారిమీద దయ చూపించే సామాన్య గురువులలా కాక ఎటువంటి సేవలను ఆశించకుండా నిర్హేతుకంగా కృపను చూపేవారని చెపుతున్నారు.

దిశతి ఉపతి శతి ఇతి దేశికః…… శాస్త్రార్థములను ఉపదేసించువారు, దేశికులని పిలువబడుతున్నారు.  “ దేశికానాం ఇమ్తరః దేశికేంద్రః “ ఆచార్యులైన దేశికులకు నాయకులు. ఆచార్యులైన దేశికులకు నాయకులు అంటే ఆచార్యులకు ఉండవలసిన జ్ఞానము, అనుష్టానము, దయ మొదలైన గుణ పరిపూర్ణులు, ఆచార్యులకే తల మాని కము వంటి వారు. మామునుల అరిపాదాలు తామర వంటి ఎరుపు రంగులో ఉంటాయి. నఖములు అంచులలో కొద్దిగా వంగి పౌర్ణమి వెన్నెల వెలుగును పోలిన రంగులో ఉంటాయి. వారి శ్రీపాదాలు మొత్తం మెత్తగా, పాలవంటి తెలుపు రంగును కలిగి ఉంటాయి.  మామునులు ఆదిశేష అవతారము కావున అప్రాకృతములు (పరమపదములో మాత్రమే ఉండే ఉన్నత పదార్థము.) అంటారు. ఈ లోకంలో ఉండే సంసారుల పాదాలలాగా సామాన్యమైనవికావు.  అందుకే వారి పాదాలను “ఉన్మీలత్ పద్మగర్భ ద్యుతి “ తో పోల్చారు. ఇతర పోలికలు కూడా ఉత్తమ పురుషుడికి ఉండవలసిన వాటినే చెప్పారు. భగవద్భక్తులైన ఆళ్వార్లు ‘నిన్ శేమ్మా పాదపర్బుదం తలై సేర్తు‘ అని పరమాత్మను ప్రార్థించారు. అలాగే ఆచార్యులపై అపారమైన భక్తి గల శిష్యులు ఒకరు ‘పాదయుగ్మం దిశతు శిరసి మే’ అంతటి ఉన్నతమైన పాదాలను తన శిరస్సు మీద ఉంచి అనుగ్రహించ వలసిందిగా ఆచార్యులైన మామునులను ప్రార్థిస్తున్నారు. ‘తమరి శ్రీపాదాలను నా శిరసు మీద పెట్టండి‘ అని అనకుండా ’దాసుడి శిరసు మీద తమరి శ్రీపాదాలను ఉంచి అనుగ్రహించండి’ అని ప్రార్థన చేస్తున్నారు.

ఈ విషయాన్నీ ముందు ముందు వచ్చే శ్లోకాలలో వివరంగా చూడవచ్చు.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-tamil-6/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment