ఉత్తర దినచర్య శ్లోకం 13 – అథ భృత్యా

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 12

శ్లోకము

అథ భృత్యా ననుజ్ఞాప్య కృత్వా చేత శ్శుభాశ్రయే !

శయనీయం పరిష్కృత్య శయానం సంస్మరామి తమ్ !!

ప్రతిపదార్థము:

అథ = శిష్యులకు తత్వోపదేసములు చేయటంలో పగలు రెండు ఝాములు గడచిన తరువాత

భృత్యాన్  = మునుపు పేర్కొన్న ప్రియ శిష్యులకు 

అనుజ్ఞాప్య = సందేహ నివృత్తి చేసిన తరువాత

శ్శుభాశ్రయే = కన్నులకు,మనసుకు ఆనందాన్ని,కలిగించే పరమాత్మ శుభకరమైన దివ్యమంగళ విగ్రహం మీద

చేతః కృత్వా = మనుసును నిలిపి

శయనీయం = శయనించటానికి

పరిష్కృత్య = ఉపక్రమించి

శయానం = విశ్రాంతి తీసుకుంటారు

తమ్ = అలాంటి మామునులను

సంస్మరామి = స్మరించుకుంటాను

భావము:

‘ కృత్వా చేత శ్శుభాశ్రయే ’….అనటం వలన రాత్రి చేయవలసిన భగవధ్యానమనే యోగము అని చెప్పబడింది. ‘తతః కనక పర్యంజ్ఞ్కే ‘(4) అని 4 వ శ్లోకంలో చెప్పినట్లు మామునులు భగవధ్యానానికి అనువైన ఆసనము నుండి లేచి స్తోత్రము చేయడానికి శిష్యులను కటాక్షించి వారికి  సెలవుఇచ్చి పంపించిన తరువాత శయనించటానికుపక్రమించే వారు, భగవధ్యానము చేస్తూ అలాగే నిద్రకుపక్రమించేవారు. అటువంటి మామునులను ఎఱుమ్బియప్పా ధ్యానిస్తు న్నారు. (మామమునులు సాక్షత్ అనంతుడి అవతారము కావున అప్రాకృతమైన వారి తిరుమేని సౌందర్యము, వారు నిద్రించే సమయంలో ధ్యానము చేసే విధానము ఇక్కడ వర్ణిస్తున్నారు. పరమాత్మ తిరుమేని మామునులకు  శుభాశ్రయము . మామునుల తిరుమేని ఎఱుమ్బియప్పాకు శుభాశ్రయము. యతీంద్రప్రణవులైన మామునులు పరమాత్మ హృదోయోల్లాసాని కోసం ఆయనను ధ్యానించినట్లు, తమను మణవాళమామునుల కైంకర్యమునకే అంకితము చేసుకున్న ఎ ఱు మ్బియప్పా వారిని ధ్యానము చేశారు . శ్రీరాముడి ప్రసక్తి యతీంద్రప్రణవప్రభావంలోను, వరవరముని శతకంలోనూ కనపడుతుందికావున , యతీంద్రులైన సౌమ్యజామా త్రుయోగీంద్రులను ధ్యానము చేయటం , వీరు తమ తిరువారాధనాదైవమైన  శ్రీరాముడి హృదోయోల్లాసానికని కూడా భావించవచ్చు. )

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-13/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment