ప్రమేయసారము – తనియన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

arulalaperumalemperumanar-svptrఅరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్ – శ్రీవిల్లిపుత్తుర్

mamunigal-vanamamalai-closeupమణవాళ మామునులు – వానమామలై

నీంగామల్ ఎన్ఱుం నినైత్తుత్ తొళుమింగళ్ నీళ్ నిలత్తీర్

పాంగాగ నల్ల ప్రమేయ సారం పరిందళిక్కుం

పూంగావళం పొళిల్ సూళ్ పుడై వాళుం పుదుప్పుళి మన్

ఆంగారం అఱ్ఱ అరుళాళ మాముని అంపదమే!

ప్రతిపదార్థము:

నీళ్ నిలత్తీర్ = ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా!

పూంగా  వళం పొళిల్ =  అందమైనన తోటలు, పెద్ద తోపులు

సూళ్ పుడై = నాలుగు దిక్కుల విస్తారముగా వున్న

పుదు ప్పుళి = పుదు ప్పుళి అనే ప్రాంతములో

మన్ వాళుం = పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్న

ఆంగారం అఱ్ఱ = గర్వము లేని

అరుళాళ మాముని = అరుళాళ మాముననుల

పాంగాగ = అనుకూలమైన , ఉపయోగకరమైన

నల్ల ప్రమేయ సారం = ఆత్మోజ్జీవనానికి ఉపకరించే ఉన్నతమైన తిరుమంత్ర సారమును

పరిందళిక్కుం = దయతో కృపచేసే

అంపదమే = శ్రీపాదములను

ఎన్ఱుం నీంగామల్ = ఎన్నటికీ వదలక

నినైత్తు తొళుమిన్ గళ్ = స్మరించి నమస్కరింతురు గాక!

వ్యాఖ్యానము:

ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా! అరుళాళ మాముననుల శ్రీపాదములను  ఎన్నటికీ మరవక స్మరించి నమస్కరింతురు గాక! ‘ ఎన్ఱుం ‘  (  ఎన్నటికీ ) అన్న ప్రయోగం ‘ నీంగామల్ ‘  (వదలక) , ‘ నినైత్తు  ‘ ( స్మరించి) అనే రెంటికీ వర్తిస్తుంది. విషయ సాంద్రతను కొలవడానికి ఉపకరణము ప్రమాణము . చెప్పబడిన విషయము ప్రమేయము . దాని సంగ్రహ రూపము ‘ సారము ‘ , అదిఏ ‘ ప్రమేయ సారము ‘అని పిలవబడుతుంది.

ప్రమాణము – కొలమానము

ప్రమేయము  – కొలవబడిన విషయము

సారము – సంగ్రహము

మానము, మేయము – సారము

అర్థాత్ ప్రమాణము తిరుమంత్రము . దాని అర్థము ప్రమేయము . ఆ అర్థము యొక్క సంగ్రహ రూపము ప్రమేయ సారము అని చెప్పబడింది . ‘ నల్ల ప్రమేయ సారం ‘ అనగా దోష రహితమైన గ్రంధము అని చెప్పటము .

పాంగాగ …..అభ్యాసకుల శక్తికి తగినట్టుగా….సులభముగా , పది పాశురములలో సులభముగా అర్థమయ్యే రీతిలో ,తిరుమంత్రము యొక్క సారాన్ని వివరించారు. అందువల్లనే ఈ ప్రబంధానికి ప్రమేయ సారమని పేరు పెట్టారు .

పరిందళిక్కుం…....సమస్త జీవుల క్షేమాన్ని కోరి కారుణ్యముతో ఈ ప్రబంధాన్ని ‘ఓరాణ్వళి ‘ (గురుశిష్య పరంపరగా) అనుగ్రహించారు.

ఆంగారం అఱ్ఱ అరుళాళ మాముని …….అరుళాళ మాముని ..అంటే సమస్త జీవులపై కృపగలవారు అని అర్థము. ఇటువంటి ఉన్నతమైన గుణము మునులలో గాని , తపస్వులలో గాని కనపడదు. అందుకే వీరు మామునులు (మహా మునులు).’ ఆంగారం అఱ్ఱ ‘ అహంకార రహితుడైన….. ఇంతటి గొప్పగుణము నాలోనే ఉంది కదా అన్న అహంకారము లేశమైనా లేని వారు .అందుకే ‘  మామునులు ‘.అంతటి ఆచార్యుల శ్రీపాదాలను కొలవండి అంటున్నారు . కొలిచేటప్పుడు ఆ శ్రీపాదాలను మనసులో నిలుపుకోవాలి .అంతే కాదు రూపము- నీడ లాగా ఎప్పుడు వదలక వుండాలి.

అంపదత్తై……..‘ అం ‘ ‘ పదత్తై ‘..అందమైన పాదములు  …. అనగా అందమైన ఉన్నత పాదములు ఏవి  అంటే, తమ శిష్యులను ఎప్పుడు వదలక కాపాడు తత్వము గల పాదములు. ఆ అందమైఅన పాదమునే కొలవండి ….అంటున్నారు . ఆ పాదములను కొలిస్తే చాలు . ఇతర దైవములను  ఆశ్రయించనవసరము  లేదు అని నొక్కి చెప్పటము అవుతుంది .

పుదుప్పుళి మన్ …..వేద శాస్త్రములను వడపోసిన పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్న వారు అని అర్థము .దట్టంగా తోటలు,తోపులతో నిండి వున్న’ పుదుప్పుళి ‘ అనే ప్రాంతము….అని , జ్ఞాన సంపదకు ఆలవాలమైన ప్రాంతము అని సంకేతముగా చెపుతున్నారు .

పుడై ……నాలుగు దిక్కులు. ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా! ఉన్నతమైన స్థానము, పేరు పొందడానికి హేతువైన తిరు మంత్రసారమును మహా కారుణ్యముతో సులభ శైలిలో తమిళములో చెప్పబడిన ” ప్రమేయ సారము ” అనే ఈ ప్రబంధమును అనుగ్రహించిన వారు గర్వము లేని అరుళాళ మాముననులు . వారు అందమైనన తోటలు, పెద్ద తోపులు , అన్నివైపుల విస్తారముగా వున్న పుదు ప్పుళి అనే ప్రాంతములో పండిత గొష్టికి నాయకులుగా విరాజిల్లుతున్నరు .వారి శ్రీపాదములను వదలక , నిరంతరము స్మరించి ధన్యులవుదురు  గాక! అని అర్థము.

ఆడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-thaniyan/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

About Sarathy Thothathri

Disciple of SrImath paramahamsa ithyAdhi pattarpirAn vAnamAmalai jIyar (29th pattam of thOthAdhri mutt). Descendant of komANdUr iLaiyavilli AchchAn (bAladhanvi swamy, a cousin of SrI ramAnuja). Born in AzhwArthirungari, grew up in thiruvallikkENi (chennai), lived in SrIperumbUthUr, presently living in SrIrangam. Learned sampradhAyam principles from (varthamAna) vAdhi kEsari azhagiyamaNavALa sampathkumAra jIyar swamy, vELukkudi krishNan swamy, gOmatam sampathkumArAchArya swamy and many others. Full time sEvaka/servitor of SrIvaishNava sampradhAyam. Engaged in translating our AzhwArs/AchAryas works in Simple thamizh and English, and coordinating the translation effort in many other languages. Also engaged in teaching dhivyaprabandham, sthOthrams, bhagavath gIthA etc and giving lectures on various SrIvaishNava sampradhAyam related topics in thamizh and English regularly. Taking care of koyil.org portal, which is a humble offering to our pUrvAchAryas. koyil.org is part of SrI varavaramuni sambandhi Trust (varavaramuni.com) initiatives.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *