స్తోత్రరత్నం

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

vishnu-lakshmi

పాలకడలిలో ఆదిశేషుని పై వేంచేసిన లక్ష్మీ నారాయణులు

alavandhar-nathamunigal

ఆళవందార్ , నాథమునుల  – కాట్టుమన్నార్ కోయిల్

ఆళవందార్ విశిష్ఠాద్వైత సిద్ధాంతమున  మరియు శ్రీవైష్ణవసాంప్రదాయమున మహా పండితులు మరియు మహాఙ్ఞాని అయిన  నాథమునుల మనుమలు. వీరు తమ స్తోత్రరత్నమున ద్వయమంత్రమును  విశదపరచు ప్రధానమైన ప్రాప్యం మరియు ప్రాపకములను  వివరంగా తెలియపరిచారు. మన పూర్వాచార్యులు అనుగ్రహించిన సంస్కృత గ్రంథాలలో దీనిని మొదటిదిగా పరిగణిస్తారు.

ఇళయాళ్వార్ (శ్రీరామానుజులు)ను ఆళవందార్ శిష్యునిగా  చేయుటకు  పెరియనంబి కాంచీపురమునకు వెళతారు.  ఆ సమయమున తిరుకచ్చినంబి ఆఙ్ఞానుసారం ఇళయాళ్వార్ శాలక్కిణర్ (నూతి/బావి)నుండి దేవపెరుమాళ్ తిరువారాథనకు తీర్థకైంకర్యము చేయుచుండిరి. పెరియనంబి స్తోత్రరత్నము నుండి  శ్లోకములను  ఇళయాళ్వార్  వెళ్ళుదారిన నిలబడి పఠిస్తారు. ఈ శ్లోకమును విని ఇళయాళ్వార్ అభినివేశం పొంది  సాంప్రదాయములోకి  ప్రవేశిస్తారు.  ఎంపెరుమానార్ గా ప్రసిద్ధి ప్రసిద్ధిచెందిన ఇళయాళ్వార్ ఈ స్తోత్రముయందు  అత్యంత అభినివేశం కలిగి తమ శ్రీవైకుంఠగద్యమున ఈ  స్తోత్రమునుండి చాలా గద్యములను ఉట్టంకించారు(స్వీకరించారు).

పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధమునకు విశదమైన వ్యాఖ్యానమును కృపచేశారు. ఈ స్తోత్రములోని నిగూఢార్థములను వెలికితీసి విస్తారమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు.

ఈ గ్రంథమునకు ఉన్న తనియన్లను తెలుసుకుందాం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము :  http://divyaprabandham.koyil.org/index.php/2016/12/sthothra-rathnam/

పొందుపరిచిన స్థానము : http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *