పూర్వ దినచర్య – శ్లోకం 31 – అబ్జాసనస్థ

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 30

శ్లోకం 31

అబ్జాసనస్థ మవదాత సుజాతమూర్తిం

ఆమీలితాక్ష మనుసమ్హిత మంత్రతంత్రం ।

ఆనమ్రమౌళిభి రూపసిత మంతరంగైః

నిత్యం మునిం వరవరం నిభృతో భజామి ।।

ప్రతి పదార్థము:

అబ్జాసనస్థం = పద్మాసనములో వేచేంసి వున్న వారై

అవదాతసుజాతమూర్తిం = స్వచ్చమైన పాలవంటి తెల్లని మేని చ్చాయ గలవారై

ఆమీలితాక్షం = పరమాత్మ స్వరూపాన్నే నిరంతరం ధ్యానించుట వలన ఆమీలిత నేత్రములను కలిగి వున్న వారై

అనుసమ్హిత మంత్రతంత్రం = రహస్య మంత్రములలో రత్నము వంటి ద్వయమును కలిగియున్నవారై

ఆనమ్రమౌళిభిః = నమ్రత చేత శిరసు వంచిన వారైన

అంతరంగైః = కొయిల్ అణ్ణన్, ప్రతివాది భయంకరం అణ్ణా మొదలైన అంతరంగ శిష్యులుచే

ఉపాసితం = నిరంతరము సేవింపబడు వారైన

వరవర మునిం = వరవర మునులు

నిభృతో = ఆశక్తి గలవాడనై

నిత్యం భజామి = నిత్యము సేవిస్తాను

భావము:

అందమైన,అధికముగా గాలివీచని చదునైన ,శుభ్రమైన స్థలములో ముందుగా పీఠమును వేసి దానిపై ధర్భలను పరచి, ఆపై మౌంజీ పరచి ,దానిపై శుభ్ర వస్తమును పరచి ఆసనమును సిధ్ధము చేయాలి.ఆ ఆసనముపై స్థిర చిత్తముతో,పద్మాసనములో కూర్చున్న వాడై యోగాభ్యాసము చేయాలని విశ్వామిత్రుడు చెప్పిన విధముగా మామునులు ఇక్కద కూర్చున్నారు.  ఇరు నేత్రాలను కొద్దిగా తెరచి ముక్కు అంచునే చూస్తూ యోగాభ్యాసము చేయాలని శాస్త్రములో చెప్పిన విషముగా మామునులు అర్థ నిమీలిత నేత్రాలతో కూర్చొని వున్నారు.సదా శ్రీమహా విష్ణువు ధ్యానములో ఉండుట చేత ఆ ఆనందానుభవము వలన కనుల నుండి ఆనంద భాష్పాలు రాలుతుండగా, శరీరము పులకరించి, గగర్పాటు కలిగి రోమములు నిక్కబొడుచుకొనుట చేత యోగి అయిన మామునులు అందరికీ దర్శనీయుడు అని ఎఱుంబిఅప్పా వర్ణిస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-31/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *