యతిరాజ వింశతి – 5

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 4

అష్ఠాక్షరాక్యమనురాజపదత్రాయార్ఠనిష్ఠాం మమాత్ర వితరాధ్య యతీంద్రనాథ |
శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే హృష్ణాస్తు నిత్యమనుయూయ మమాస్య బుధ్ధిః ||

ప్రతి పదార్థము:

నాథ = దాసులకు స్వామి అయిన

యతీంద్ర = యతీంద్రులు

అత్ర = అజ్ఞానంధకారమైన ఈ సంసారములో

అత్య = కలి పురుషుడు పాలిస్తున్న ఈ కాలములో

మమ = దాసుడికి

అష్ఠాక్షరాక్యమనురాజ = అష్ఠాక్షర మంత్రములోని

పదత్రాయార్ఠనిష్ఠాం = మూడు పదాలలో వున్న అనన్యార్హ శేషత్వము,అనన్య శరణత్వము, అనన్యభోగ్యత్వము యొక్క అర్థమును

వితర = అనుగ్రహించాలి

శిష్ఠాగ్రగణ్యజనసేవ్యభవతపదాభ్జే = పరత్వము, మోక్షోపాయము,పురుషర్థము మొదలగువాని యందు ధృడ అధ్యవసాయము గల శిష్ఠాగ్రగణ్యులైన కూరత్తాళ్వాన్,తిరుకుగైపిరాన్ పిళ్ళాన్ మొదలైన వారు స్తుతించే తమరి తామరల వంటి శ్రీపాదములను

నిత్యమనుయూయ = ఎప్పుడు అనుభవించి

అస్య మమ బుధ్ధిః = దాసుని అల్ప బుధ్ధి

హృష్ణా = ఆ అనుభవము వలన కలిగిన కైంకర్యము ఫలితముగా ఏర్పడిన సంతోషమును పొందు భాగ్యము

అస్తు = కలుగు గాక

భావము:

ఈ శ్లోకము మొదలు ఆఖరి శ్లోకము వరకు ” నిత్యం యతీంద్ర  “అనే మూడవ శ్లోకమునను వివరిస్తున్నట్ళుగానే అమరినవి.” శ్రీమత్ యతీంద్ర ”  అన్న 19వ శ్లొకము ఈ స్తోత్రమునకు సంక్షిప్తముగా , యతీంద్ర కైంకర్య ప్రార్థనకు , యతీంద్ర దాస కైంకర్య ప్రార్థనకు ,ఉపసమ్హారముగా అమరినది. విజ్ఞాపనం యతిదం అనే20వ శ్లోకము మొదటి ,చివరి, మధ్య, చెప్పిన విషయాలకు హేతువులను చూపుతూ దృడపరుస్తున్నట్లుగా అమరినవి. అష్ఠాక్షరి మంత్రములోని మూడు పదములు స్థూలముగా ఆచార్యలకే దాసులవుట , ఆచార్యలనే మోక్షోపాయముగా , ఆచార్యలకే భోగ్యముగా స్వీకరించుటను తెలియ జేస్తున్నాయి. సూక్ష్మముగా  భాగవతులకే దాసులగుటయే పరమార్థమని, భాగవతులనే  మోక్షోపాయముగా , భాగవతులకే భోగ్యముగా తెలియ జేస్తున్నాయి. భగవద్కైంకర్యము చేసే మొదటి స్థితిని ప్రధమ పర్వమనిష్టమని అంటారు. భాగవత  కైంకర్యము చేసే రెండవ స్థితిని మధ్యమ పర్వనిష్టమని అంటారు. ఆచార్యలకే కైంకర్యము చేసే మూడవ స్థితిని అంతిమ పర్వనిష్టమని అంటారు. ఓం నమో నారాయణాయ అనేమూడు పదములు వరుసగా శేషిత్వ, శరణ్యత్వ,  భోగ్యత్వములను భగవంతుడి విషయములో ముందుగా తెలియజేసి, తరువాత భగవంతుడి పాదముల వద్ద వుండే భాగవతుల విషయముగా తెలియజేస్తున్నది.ఆ తరవాత ఆ భాగవతులను అక్కడకు చేర్చే భాగవత్తోత్తములైన ఆచార్యుల పరముగా తెలియజేస్తున్నది. అర్థాత్ మొదటి స్థాయి భగవంతుడు, మద్యమ స్థాయి భాగవతులు, అంతిమ స్థాయి అచార్యులు.

మామునులు ఈ శ్లోకములో తిరుమంత్రములోని మూడు పదములకు అర్థముగా రామానుజులను కీర్తించారు. అనగా రామానుజులనుకే  కైంకర్యము చేయుట. వారినే ఉపాయముగ స్వీకరించుట , వారినే పురుషార్థముగా విశ్వసించుట. అందుకు వారి మంగళాశాసనములను కోరుచున్నారు. 32  అక్షరములను కలిగివుండే నృసింహ మంత్రము కూడా మంత్రరాజముగా పిలువబడుచున్నది. అందు వలన ” అష్ఠాక్షరాక్య  ” అని దీని ప్రత్యేకతను చెప్పారు. తిరుమంత్రము అష్ఠాక్షరిగానే ప్రసిద్దమైనది. దీనిలోని ఉత్తర భాగము ద్వారా అచార్యనిష్టులైన కూరత్తాళ్వాన్, మొదలియాండాన్ల వంటి శిష్ట జనులు తమ పాదాల వద్ద కైంకర్యము చేసి పొందిన సంతోషమును దాసుడికి కూడా  అనుగ్రహించ వలసినదని రామానుజులను ప్రార్థిస్తున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-5/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment