యతిరాజ వింశతి – 10

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 9

హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ |
సోహం తవాప్రియకరః ప్రియకృత్వ దేవ కాలం నయామి యతిరాజ!తతోస్మి మూర్ఖః ||

ప్రతి పదార్థము :

యతిరాజ! = ఓ యతిరాజ

య అహం = దాసుడు

మనసా క్రియయా చ వాచా = మనోవాక్కయ కర్మలనే త్రివిధముల

త్రివిధాపచారాన్ =   భగవధపచార, భాగవతాపచార, అసహ్యాపచారమనే మూడు విధములైన అపచారములను చేస్తూ

సతతం చరామి  = నిరంతరము తిరిగే

స అహం = అటువంటి దాసుడు

తవ = నీచుడినైన దాసుడిపై అపారమైన దయను చూపే తమరు

అప్రియకరః సన్ = ఇష్టము లేని వాటినే చేసే వాడిని

ప్రియకృత్వ ఏవ = ఇష్టమున్న వాటినే చేసే వాడివలె

కాలం నయామి = కాలము గడుపుతున్నాను

హా హంత హంత = అయ్యో, అయ్యో,అయ్యో

తత అహం మూర్ఖః అస్మి = అందు వలన దాసుడు  మూర్ఖుడవుతున్నాడు

తత్వరాయా = తమరు ఆ మూర్ఖత్వమును తొలగించి కృప చూపాలి

 

భావము:

మనసులోని చెడు తలపులను, మూర్ఖత్వమును తొలగించి కృప చూపాలని కోరుతున్నారు. నిత్యం యతీంద్ర అనే నాలుగవ శ్లోకములో మానసిక శుచికి సంబంధించిన పట్టికను , వృత్తయా పసః అనే 7వ శ్లోకములో ,దుఃక్ఖావహోsహం అనే 8వ శ్లోకములో ,నిత్యంత్వహం అనే 9వ శ్లోకములో , హా హంత హంత అనే 10వదైన ప్రస్తుత  శ్లోకములో త్రికరణ శుధ్ధ్దిని ప్రస్తావించినా  7వ 8వ  శ్లోకములలో వృత్తయా అని, దుష్ట చేష్టిత అని అనటము వలన కరణ కృత్యములను , 9వ శ్లోకములో గురుం పరిభవామి అంటము వలన వాక్కును ,10వదైన ప్రస్తుత శ్లోకములో మనసా అనుట వలన మనో  కృత్యములను ప్రధానముగా చూడవలసి వుందని వ్యఖ్యాత అయిన అణ్ణవప్పంగార్ స్వామి భావిస్తున్నారు.

భగదపచారమనేది – శ్రీమన్నారాయణుని బ్రహ్మ రుద్రాలుతో సమానముగా భావించుట , రామాది అవతారములను సామాన్య మానవులుగా చూచుట ,  అర్చావతారములను కేవలము రాళ్ళుగాను, లోహములుగాను భావించుట మొదలైనవి.

భాగదపచారమనగా-తన ధనలాభము కొరకు ,చందనము , పుష్పము, స్త్రీల కొరకు  శ్రీవైష్ణవులకు చేయు విరోధము.

అసహ్యాపచారమనగా-నిష్కారణముగా భగవంతుడి విషయములో , భాగవతుల విషయములో దేషమును కలిగి వుండుట, ఆచార్యాపచారము అవుతుంది. దీని వివరణ శ్రీవచన బూషణములో చూడవచ్చు.

పై మూడు రకాల అపచారములు చేయుట తనకు బాధా కరమగుట వలన హా! హంత హంత అని మూడు సార్లు అన్నరు. 6వ శ్లోకములో “తత్వరాయ “అన్న ప్రయోగాన్ని ఈ 10వ శ్లోకము వరకు వర్తిస్తున్నది. తొండరడి పొడి ఆళ్వార్లు తిరుమాలై -32వ పాశురములో  ‘మూర్కనేన్ వందు నిన్రేన్ మూర్కనే మూర్కనావేన్ ‘ అని మూడు సార్లు తమ గురించి చెప్పుకున్నట్లుగా మామునులు ఇక్కడ 8,9,10 శ్లోకములలో చెప్పుకున్నారని వ్యాఖ్యాత అభిప్రాయ పడుతున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-10/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment