పూర్వ దినచర్య – శ్లోకం 22 – తతస్సార్థం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 21

శ్లోకం 22

తతస్సార్ధం వినిర్గత్య భ్రుత్యైర్నిత్యానపాయినిభిః!
శ్రీరంగమంగళం ద్రష్టుం పురుషం భుజగేశయం!!

ప్రతిపదార్థము:

తతః = ద్వయ మంత్రోపదేశము తరువాత
శ్రీరంగమంగళం = శ్రీరంగమునకు మంగళము చేయువారైన
భుజగేశయం = ఆదిశేషుడిపై పవళించిన వాడై
పురుషం = పురుషోత్తముడైన శ్రీరంగ నాథుడిని
ద్రష్టుం = సేవించుకోవటానికి
నిత్యానపాయినిభిః భ్రుత్యైః స్సార్థం = ఒక్క క్షణమైనా వదలక కూడి వుండే కొయిల్ అణ్ణన్ లాంటి దాసులతో చేరి
వినిర్గత్య = తమ మఠము నుండి బయలుదేరిరి

భావము:

స్వతహాగా మంగళమును సూచించు ‘ శ్రీ ‘ శబ్దము ఇక్కడ రంగ నగరానికి సంకేతముగా మారింది.’ శ్రీ ‘ అయిన రంగము శ్రీరంగముగా మారినట్లయింది. శ్రీరంగనాథుడు ఇక్కద పవళించటము చేత శ్రీరంగమునకు ఔన్నత్యము ఏర్పడ లేదు. మరెందు చేతనంటే అందరికీ ఔన్నత్యమునొసగే రంగనాథుడే తమ ఔన్నత్యమును పెంపు చేసుకోవటానికి సహజముగానే ఔనత్యము ఉండే ఈ రంగ నగరము తనకు ఆస్థానమయింది. ‘ క్షీరాబ్దేర్ మండలాత్పాణోర్ యోగినాం హృదయాదపి,రతిం కతోహరిర్యత్ర తస్మాత్ రంగ మితి స్మృతుం ‘ ( శ్రీమన్నారాయణుడు పాలకడలి, సూర్య మండలము,యోగుల హృదయములు ,మొదలైన వాటి కంటే ఇష్ట పడ్డ స్థలము కావున ఈ చోటు శ్రీరంగమని పిలువ బడుతున్నది) అనే  శ్లోకమును గుర్తుచేసుకోవాలి.  ఈ విషయము శ్రీమన్నారాయణుని హృదయము నుండి చెప్పబడింది. మనవంటి వారికి ‘శ్రీరంగ మంగళం ‘ అనగా శ్రీరంగ నగరమునకు కీర్తిని పెంపొందిస్తున్నారు శ్రీరంగనాథులు , అందువలన ఇది అనుభవించు విషయం. ఈ రెండు భావములు గొప్పవే .
1. పురుషఃపురతి ఇతి పురుషః . అనేది మొదటి ఉత్పత్తి. ‘పురాగ్రగమనే ‘అనే ధాతు నుండి వచ్చినది, అనగా సృష్టి కి పూర్వము ఎమ్పెరుమాన్ ఉన్నారు. జగక్తారణత్వ స్వరూపం చెప్పబడింది.
2.పురీ సేతే ఇతి పురుషః అనే రెండవ ఉత్పత్తి. జీవాత్మల శరీరములో (హృదయ కుహరములో)ఉండు వాడు అని ఉండటము వలన అంతర్యామిత్వము సూచింపబడుచున్నది.
3. పురు సనోతి ఇతి పురుషః అని మూడవ ఉత్పత్తి. అపారముగా ఇచ్చు వాడని దీని అర్థము. అనగా అడిగిన వాడికి అడిగినదే కాక తనకవకాశమున్నత వరకు ఇచ్చు ఔదార్యము కల వాడు అని చెప్పబడింది.
పై మూడు ఉత్పత్తులు అళగియ మణవాళ పెరుమాళ్ కు సరిపోవును. ఆదిశేషుడిపై పవళించి వుండుట పరతత్వము యొక్క లక్షణము అని పెద్దలు చెపుతారు. శ్రీరంగమంగళుడైన,భుజగ శయనుడైన శ్రీరంగనాథుడిని మణవాళ మామునులు సేవించుట కేవలం ఎమ్పెరుమానార్ సంతోషము కోసమే తప్ప వేరొక కారణము లేదు అనేది స్పష్టము. ‘ నిత్యానపాయిభిః బృత్యైః ‘ మనుషులను ఒక్క క్షణమైనా వీడకుండా వుండేది వారి నీడ మాత్రమే అయినా అది కూడా చీకటిలో వీడి పోతుంది.కాని మామునుల శిష్యులు చీకటిలో కూడా వీడి పోరని అణ్ణవప్పంగార్ స్వామి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకము ద్వారా మామునుల విషయములో శిష్యులకున అపారమైన ప్రేమబోధపడుతుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-22/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment