శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
అవతారికా
యెరుంబియప్ప తమ పూర్వ దినచర్యలో నిత్యానుష్టానమును వివరిస్తూ అభిగమము, ఉపాదానం, ఇజ్జా అనే మూడు విధానాలను తమ ఆచార్యుల పరముగా తెలియజేశారు. ఇక నాలుగవ అనుష్టానమిన స్వాధ్యాయమును ఆచార్య పరముగా అనుభవించాలని తలచారు. స్వాధ్యాయములో పూర్వాచార్య గ్రంధములను శిష్యులకుపదేశించుట అను విధానమును స్వీకరించారు. ‘వాక్యాలంకృతి వాక్యానాం వ్యాక్యాధారం ‘ (ఉత్త దినచర్య-1) అని చెప్పతలపెట్టి, కొత్త గ్రంధమును రచించుట ప్రారంభించి , ముందుగా, మణవాళ మామునుల ఆచార్య నిష్టకు ప్రతీకగా వారు తమ ఆచార్యులైన యతిరాజుల మీద రచించిన ‘ యతిరాజ వింశతిని ‘కి తనియన్ చెప్పి ఎరుంబియప్పా ఆచార్య నిష్టను చాటుకున్నారు.
పరమ పూజ్యులైన మణవాళ మామునులు ప్రపన్న జన కూఠస్తులైన (మొక్షమును పొందుటకు శ్రీమన్నరాయణుడే ఉపాయమని,దానికై ప్రపత్తిని అనుష్టించే పెద్దలకు మూల పురుషులు ) నమ్మాళ్వార్లు మొదలైన పూర్వాచార్య పరంపర లభించినందుకు,తమ అచార్యులైన తిరువాయిమొళి పిళ్ళైచేత తాము ఉపదేశము పొందుట, మంత్రత్రయ సార రూపమైన శ్రీమద్రామానుజాచార్యులను మొక్షోపాయముగా,ఉపేయముగా విశ్వసించారు. వారి మీద తమకు గల అపారమైన భక్తి చేత,ఈ సంసారములో పడి కొట్టుకుంటున్న ప్రజలను ఉధ్ధరించగలవారగుటచేత, తమ కారుణ్య భావము వలన ‘ యతిరాజ వింశతిని ‘ రచింప తలపెట్టి ఈ పనికి అవరోధములు కలుగకుండా , సంపూర్తి అవటము కోసము యతిరాజ నమస్కార రూపముగా ఈ రెండు శ్లోకాలను చెప్పారు.
రహస్యమంత్రార్థముగా వెలసిన ఈ గ్రంధము రహస్యమంత్రములైన తిరు మంత్రము,ద్వయ మంత్రము ,చరమశ్లోకముల మొత్తము అక్షరముల సంఖ్య ఇరవై కాగా రహస్యమంత్రార్థముగా వెలసిన ఈ గ్రంధములోని శ్లోకాలు అదే సంఖ్యలో అమరుట విశేషము.
తనియన్
యఃస్తుతిం యతిపతిప్రసాధినీం వ్యాజహార యతిరాజ వింశతిం |
తం ప్రపన్నజన చాతకాంభుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం ||
ప్రతి పదార్థము:
య@ = ఎవరైతే
యతిపతి ప్రసాధినీం = యతిరాజులైన ఉడయవర్లను అనుగ్రహింప చేశారో
యతిరాజ వింశతిం = ఆ యతిరాజుల విషయమై ఇరవై శ్లోకములను కలిగివుండుట వలన యతిరాజ వింశతి అనే పేరును కలిగి వున్న
స్తుతిం = స్తోత్రమును
వ్యాజహార = అనుగ్రహించారో
ప్రపన్నజన చాతకాంభుదం = ప్రపన్నజన జన కూఠస్తులకు చాతక పక్షి లాగా దాహమును తీర్చు మేఘము వంటి వాడైన
తం సౌమ్యవరయోగి పుంగవం = ఆ అళగియ మణవాళరన్న పేరును కలిగి వున్న ముని శ్రేష్టులను
నౌమి = స్తుతిస్తున్నాను
భావము:
ఈ తనియన్ ఎరుంబియప్పా అనుగ్రహించినది. యతిపతిప్రసాదినీ – ఈ యతిరాజ వింశతిని అనుసంధానము చేయువారిని అనుగ్రహించకుండావుండలేని ఉడయవర్లు అన్న అర్థములో ప్రయోగింపబడినది. ప్రపన్నజన చాతకాంబుదం – చాతక పక్షి ప్రాణప్రదమైన కారుమేఘముల వంటి వారు. ప్రపన్న జనులకు మొక్షమునొసగి రక్షించువారని అర్థము. యోగిపుంగవ – యోగులలో ఉత్తములైన మామునులు అని భావము .
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-thaniyan/
పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org