పూర్వ దినచర్య – శ్లోకం 9 – మంత్ర

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 9

మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం!

తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం!!

 

 ప్రతి పదార్థము:

మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం—– మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును నిరంతరము అనుసంధానము చేస్తూ వుండటము వలన మెల్లగా కదులుతున్న పెదవులు గల వారు….

తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం—–ఆ  ద్వయ మంత్రములోని అర్థమును స్మరిస్తూ వుండటము చేత పులకించి పోయిన శరీరము…….

భావము:

ఈ శ్లోకములో అధర సౌందర్యమును చెపుతున్నారు. “శ్రీమన్నరాయాణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణయ నమఃఅ ” అన్నది ద్వయ మంత్రము. అష్టాషరి కంటే ఉన్నతమైనదవుట చేత ఈ మంత్రమును మంత్ర రత్నమని ప్రసిధ్ధి చెందింది.  గుహ్యములలో(రహస్యములు)  పరమ గుహ్యము ఈ మంత్రము. సంసార సాగరమును దాటించేది. సమస్త పాపములను పోగొట్టగలది. అష్టాక్షరి మంత్రములోని అనుమానాలన్నింటిని పోగొట్ట గలది. ఈ శరణాగతి మంత్రము సకల సంపదలను , సుఖములను ఇవ్వగలది  అని పరాశరులు నారదుడికి ఉపదేశించారు. అనుసంధానమంటే మెల్లగా తనకు మాత్రమే వినపడే టట్లు ఉచ్చరించి రక్షించటము అని శాస్త్రము చెపుతున్నది.

ద్వయమును అర్థానుసంధానము చేయకుండా కేవలము మూలమును మాత్రమే అనుసంధానము చేయటము ఉత్తమ అధికారి లక్షణము కాదు . మామునులు  అర్థానుసంధానము చేస్తున్నారని తెలుపుతున్నారు.   ద్వయము యొక్క అర్థము పిరాట్టి పురుషకారము. వాశ్చల్యాది గుణములు, ఆగుణములతో కూడిన సిధ్ధోపాయమైన  శ్రీమన్నారయణుని , ఆయన తిరుమేనిని,  శ్రీచరణములను శరణాగతి చేయుట.

నిధన్యాన—  నితరం ధన్యానం అంగా భావనాప్రకర్షమనబడే నిరంతర ధ్యానం దానినే ” తైల ధారావత్ ” అంటారు. దీని వలన భగవద్భక్తులకు ఆశ్చర్యము వలన, సంతౌషము వలన మేనిలో గుగుర్పాటు కలుగటము సహజము. మామునులకు ఆ  గుగుర్పాటు కలిగిందని ఈ శ్లోకములో చెపుతున్నారు. ద్వయమును, దాని అర్థమును  అనుసంధానము చేయటమే ప్రపత్తి.  ప్రపత్తి ఒక్క సారే చేయవలసి వుండటముచేత  ఒక సారి చేసిన తరవాత ఆపకుండా నిరంతరము అనుసంధానము చేస్తున్నారని అర్థము. అది సాధ్యమా అన్న శంక కలగ వచ్చు. మోక్షార్థియై ఒక్క సారి ప్రపత్తి  చేసినా, సత్కాలక్షేపము కోసము, భగవత్ గుణాలను అనుభవించి ఆనందించటము కోసము  నిరంతరము అనుసంధానము చేయటము జరుగుతుంది.

“తత్త్ర తత్వ నిత్యానం” అన్న్ పదానికి మరొక అర్థము కూడా చెపుతారు.

” విష్ణుః శేషీ తదీయః సుభగుణ నిలయో విగ్రః శ్రీశఠారిః శ్రీమన్రామానుజార్య పదకమలయుగం భాతి రమ్యం తధీయం !

తస్మిన్ రామానుజార్యే గురురితి చ పదం భాతి నాన్యత్ర తస్మాత్,శేషం శ్రీమత్ గురూనాం కుల మితమఖిలం తస్య నాధస్య శేషః!!

( విష్ణువు  శేషి  అర్థాత్ మనము చేయు కైకర్యములను స్వీకరించి సంతోషించే నాయకుడు. సుగుణాల రాశి అయిన ఆయన తిరుమేని శ్రీ శఠారి అనబడే నమ్మళ్వారులు. శ్రీ శఠారి  శ్రీపాదములుగా శ్రీమన్రామానుజాచార్యులు, గురుః అనే పదము శ్రీమన్రామానుజాచార్యుల విషయములో సంపూర్ణమై వెలుగుతున్నది. మరెవరి విషయములోను ఆ సంపూర్తి గోచరించదు. కావున వారి కంటే ముందు ఉన్న ఆచార్యులు, వెనక వున్న ఆచార్యులు వారికే శేషము అవుతున్నారు.) అని పెరియ వాచ్చన్ పిళ్ళై చెప్పియున్నారు.  భగవద్రామానుజులే ద్వయములోని శ్రీమన్నారయణ శరణౌ  అనే శరణ శబ్దార్థము. అదియే ” తత్త్ర తత్వం ”  అర్థాత్ శ్రీమన్నారయణుని చరణములు వారివి కావు. మరి ఎవరివంటే భగవద్రామానుజులవి ద్వయములోని అంతరార్థము. యతీంద్ర ప్రవణులైన (భగవద్రామానుజుల భక్తులు) మామునులకు భగవద్రామానుజులనే  శ్రీమన్నారయణుని చరణములను  నిరంతరము ధ్యానించుటే కర్తవ్యము కావున ఈ ద్వయమునకే ఉన్నతమైనదని ఎరుంబియప్పా అభిప్రాయము. ద్వయార్థ తత్వ ధ్యానము వలన గుగురుపాటు పొందిన తమరినే కన్నార్ప కుండ సేవించుటను, (12వ శ్లోకము) అనటము వలన విష్ణు తత్వ గ్రంధములో చెప్పిన విధముగా నిరంతరము భగవంతుడి గునణములనే స్మరిస్తూ ,వాటిచే ఆవేశించబడి,  దానివలన గుగురుపాటు పొంది ఆనంద పరవశములో కన్నీరు కార్చు భక్తుని ఈ భూమి మీద జన్మనెత్తిన వారు చూసి తరించాలి అని చెప్పినట్లుగా మామునులను ఆనంద పరవశముతో ఎరుంబియప్పా సేవించుకుంటున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-9/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment