పూర్వ దినచర్య – శ్లోకం 15 – ధ్యాత్వా

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 14

శ్లోకం 15

ధ్యాత్వా రహస్యత్రితయం తత్త్వ యాధాత్మ్య దర్పణం ।

పరవ్యూహాదికాన్ పత్యుః ప్రకారాన్ ప్రణిధాయ చ ।।

 ప్రతి పదార్థము:

తత్త్వ యాధాత్మ్య దర్పణం = జీవాత్మ స్వరూపము యొక్క  నిజ రూపమును అద్దములో ప్రతిబింబములా చూపువాడా

రహస్యత్రితయం = రహస్యత్రములనబడే తిరు మంత్రము,  ద్వయ మంత్రము, చరమశోకములను

ధ్యాత్వా = అర్థముతో అనుసంధానము చేయు

పరవ్యూహాదికాన్ = పరం,వ్యూహం మొదలగు సర్వ జగత్తుకు

పత్యుః = పతి అయిన శ్రీమన్నారాయణుని

ప్రకారాన్ = ఐదు స్థితులలోను

ప్రణిధాయ చ = ధ్యానము చేయువాడా

భావము:

జీవాత్మ స్వరూపము యొక్క  నిజ రూపములు మూడు. అవి ఏవనగా,   శ్రీమన్నారాయణుడు ఒక్కడికే దాసుడై వుండుట , ఆయననే మోక్షమునకు ఉపాయముగాను ,  భోగ్య పదార్థముగాను     గ్రహించుట .

తిరు మంత్రములో వున్న “ ఓం నమః నారాయణాయ  “ అనే మూడు పదములు పైన తెలిపిన మూడు రూపములను స్పష్టీకరిస్తున్నది.  దీనిలోని ”    నమః ” పదము సిద్దోపాయమైన పరమాత్మను   మోక్షమునకు ఉపాయముగా తెలియ జేస్తున్నది.  ద్వయ మహామంత్రములోని మొదటి భాగమైన ” శ్రీమన్నరాయణచరణౌ శరణం ప్రపద్యే ”  అనే మూడు పదాలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పుతున్నాయి . శ్రీ కృష్ణుడు గీతలో అర్జుననుకు చెప్పిన చరమశ్లోకములోని మొదటి భాగమైన “సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ” అనటము వలన శ్రీ కృష్ణుడు ,శ్రీమన్నరాయణుడైన తననే మోక్షాధికారిగా తెలుసుకొని శరణాగతి చేయమని ఉపదేశించటము  వలన ఈ మూడు మంత్రములను  అద్దము వంటివిగా చెపుతున్నారు.  ఈ విషయము రహస్యత్రయార్థములో వివరించబడింది.

  1. పరమపదములో నిత్యసూరులు, ముక్తపురుషులు అనుభవించు పరస్వరూపము
  2. పాలకడిలో శేష తల్పము మీద పవళించి బ్రహ్మాదుల ఆర్తనాధమును విని వారిని రక్షించుటకు సిధ్ధముగా వుండే వ్యూహ స్వరూపము.
  3. అసుర ,రాక్షసాదుల నుండి సాదువులను రక్షించుటకై ఈ భూలోకములో రామ ,కృష్ణాది అవతారములైన విభవ రూపము .
  4. 4.చిత్ ,అచిత్ లన్నింటి యందు లోపల బయట వ్యాపించి వుండుట , జ్ఞానుల హృదయ కమలములో వారి ధ్యానమునకు ఆధారమవుట కొరకు దివ్య మంగళ రూపములో నిలిచు అంతర్యామి  రూపము .
  5. పై రూపముల లాగా సామాన్యులకు దుర్లభము కాకుండా అఙానమావరించి వున్న మనము నివసించు స్థలములో , మనము నివసించు కాలములో , మన హ్రస్వ దృష్టికి కూడా కనపడే విధముగా కోవెలలో ,గృహములలొ మనము కోరు కున్న రూపములో కొలువు తీరి వున్న అర్చామూర్తి .

ఇవి కాక ఆచార్య రూపములో ఆరవ స్థితిలోను మనకు దర్శనము నిస్తున్నాడు. “పీదక వాడై    పిరానార్  పిరమగురువాగి వందు……..”(పెరియాళ్వార్ తిరుమొళి 5-2-8 ), (పీతాంభరధారుడు పరమ గురువుగా వచ్చి…..) అని    పీతాంభరధారుడు పరబ్రహ్మను గురించి ఉపదేశించు ఆచార్యులుగా అవతరించారని  పెరియాళ్వార్ తిరుమొళి లో చెపుతున్నారు.  దీని వలన గురుపరంపరకు ముందుగా అనుసంధించి తరువాత పరమాత్మ ఆరు రూపములను మామునులు సంధ్యా సాయంకాలమున అనుసంధానము చేస్తున్నారని బోధ పడుతుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-15/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “పూర్వ దినచర్య – శ్లోకం 15 – ధ్యాత్వా”

  1. chala bavunnadi .vaishnava lokam chesu kunna adhrusta midi.vardhatam abhi vardatam.alwaraghal vazhi arulachial vazhi.

    Reply

Leave a Comment