పూర్వ దినచర్య – శ్లోకం 14 – పరేద్యుః

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 12, 13

శ్లోకము 14

పరేద్యుః పశ్చిమే యామే,యామిన్యా స్సముపస్థితే ।

ప్రబుధ్ధ్య శరణం గత్వా పరాం గురుపరంపరాం ।।

ప్రతి పదార్థము:

పరేద్యుః = తమకు ఎదురు చూడని విధముగా  మామునులతో కలయిక లభించిన మరునాటి

యామిన్యా = రాత్రి

పశ్చిమే యామే = నాలుగవ ఝాములో

స్సముపస్థితే సతి = లభించిన మేరకు

ప్రబుధ్ధ్య = నిద్ర లేచి

పరాం = ఉన్నతమైన

గురుపరంపరాం = గురుపరంపరను

శరణం గత్వా = ధ్యానించి శరణాగతి చేసితిని

భావము:

ఆచార్య పర్యంతం పరమాత్మను సిధ్ధో పాయమని ఆశ్రయించు వాడు సర్వ ధర్మములను వదిలి వేయాలని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ , నిత్య కర్మములను భగవత్కైంకర్యముగానో , లోక కల్యాణార్థమో అనుష్టించే తీరాలని శాస్త్రము చెప్పుతున్నది.  దానిననుసరించి పరమ కారుణికులైన మామునులు అభిగమము, ఇజ్జ మొదలగు  ఐదు కర్మలను, ఐదు వేళలా అనుష్ఠించు వారు. కావున, “గురువుగారి నిత్యకర్మానుష్ఠానము శిష్యుడు అనుసరించాల” న్న శాస్త్ర నియమముననుసరించి , ఆచార్య భక్తి వలన  ఎఱుంబిఅప్పా  “మామునుల దినచర్య” అనే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు. తదీయారధన సమయములో శ్రీవైష్ణవుల పంక్తిని పావనము చేసేది ఈ ప్రబంధమేనని ముందే చూసివున్నాము.

ముందటి శ్లోకములో రహస్య త్రయానుసంధానమును పేర్కొనటము చేత , ఈ గురుపరంపర అనుసంధానమును దానికి అంగముగా భావించు కోవాలి. గురుపరంపరను ధ్యానము చేయకుండా రహస్య త్రయానుసంధానమును  చేయరాదు. ఇక్కడ గురుపరంపర  ధ్యానము  అంటే,  పరమపదములో ఆచార్య ప్రీతి కోసము చేసే భగదనుభవమనే మొక్షమనే అర్థము. ఆచార్య పర్యంతముగా పరమాత్మ ఒక్కడినే ఉపాయముగా ఉపదేశించే స్వాచార్య పరంపరగానే స్వీకరించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-14/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment