పూర్వ దినచర్య – శ్లోకం 1 – అంగే కవేర

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 1

అంగేకవేర కన్యాయః తుంగేభువన మంగళే
రంగే ధామ్నిసుఖాసీనం వందే వరవరం మునిం

$3B72773B15A9C344

ప్రతి పదార్థం:

తుంగే = ఉన్నతమైన

భువన మంగళే = సకల ప్రాణుల  మంగళములకు  కారణమైన

కవేర కన్యాయః = అక్కడ కావేరి  నదీ (నడుమ )లో ఉంటుంది

రంగే ధామ్ని = శ్రీరంగ దివ్య క్షేత్రములో

సుఖాసీనం = సుఖముగా ఆసీనమైవున్న

వరవరం = స్వరూప, ఔదార్యము,  కారుణ్యము మొదలైన వాటిలో అళగియ మణవాళ పెరుమాళ్( శ్రీరంగ నాథుడు) పోలి వున్న, అళగియ మణవాళ అనే పేరు ధరించుకున్న

మునిం = ఆచార్యులే శేషినని నిరూపించిన మణవాళమామునులు

వందే = దాసోహములు సమర్పిస్తున్నాను

భావము:

“మహి సమర్పణే”(గతౌ) ధాతు రూపములో అవతరించిన మంగళము అనే పదము గమ్యమును సూచిస్తుంది.దానికి సాధనమాన ఉపాయమును తెలుపుతుంది. “కవేర కన్యాయః అంగే”  , “రంగే ధామ్ని” అనే ప్రయోగాల కు సరిపోతుంది. ఇవి రెండు మనకు  ఉపేయమును చూపుతున్నవి మరియు మిగితా ఉపేయములకు ఉపాయముగాను చెప్పుతున్నవి అనుటలో సందేహము లేదు.

“రంగం” అనే పదము ఎమ్పెరుమానుక్కు ప్రీతి కలిగిస్తుంది .” సుఖాసీనమ్” అనుటలో మణవాళమామునుల అవతారము తరవాత శ్రీరంగమునకు మహమ్మదీయుల దండయాత్రలు కాని వేరే ఎటువంటి ఉపద్రవములు లేవు అని తెలియ జేస్తున్నది. పిళ్ళై లోకాచార్యుల, వేదాంత దేశికుల కాలములోను మహమ్మదీయుల దండయాత్రలు వుండేవి. అలా మణవాళమామునుల కాలము లో ఎటువంటి ఉపద్రవుములో లేవు.

“వది-అభివాదన స్తుత్యో” అనే ధాతు రూపములో అవతరించిన “వందే “అనే ప్రయోగముతో సాష్టాంగ నమస్కారమును, సంకీర్తనను  తెలియ జేస్తుంది. ఈ రెండు మణవాళ మామునులను గురించి కాయిక , వాచిక, మానసిక. కైంకర్యములను తెలియ జేస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/05/purva-dhinacharya-tamil-1/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *