తిరుప్పళ్ళి యెళిచ్చి – అవతారిక

periyaperumal-art  పెరియపెరుమాళ్ శ్రీరంగం

thondaradipodi-azhwar-srirangam                                                           తొండరడిపొడిఆళ్వార్ శ్రీరంగం

నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ల అవతారిక పరిచయం

నఙ్ఞీయర్  అవతారిక పరిచయం  

“అనాది మాయయా సుప్తో  యదా జీవః ప్రబుధ్యతే”అన్న వచనానుసారం- ఎప్పుడైతే జీవాత్మ సుప్తావస్థనుండి జాగృతం చెందునో) పెరియపెరుమాళ్ తన నిర్హేతుక కృపాకటాక్షం వలన విప్రనారాయణు ను   అఙ్ఞానము నుండి జాగృతం చేశారు. అనుగ్రహింపబడిన దివ్యమైన ఙ్ఞానం చేత ఆళ్వార్, పెరియపెరుమాళ్ ప్రాప్యం(లక్ష్యం) మరియు ప్రాపకం(సాధనం) అని గ్రహిస్తారు, ఇదే విషయాన్ని తమ తిరుమాలై ప్రబంధమున కూడ వివరిస్తారు. పిదప ఆళ్వార్ తాను పెరియపెరుమాళ్ కు కైంకర్యమును చేయదలచి ఎంపెరుమాన్ కు మేల్కొలుపుగా తిరుపళ్ళియెళిచ్చిని గానం చేశారు.(పాత్రలు పరస్పరం వ్యతిరిక్తమైనవి- ప్రథమంగా ఎంపెరుమాన్ తాను ఆళ్వార్ ను జాగృతిపరచగా పిదప ఆళ్వార్ తాము   ఎంపెరుమాన్ ను మేల్కొలిపిరి)

భగవానుడే లక్ష్యం మరియు సాధనం  అని తెలుసుకుంటే, సహజముగానే వారు నిరంతరం అతనినే  ధ్యానిస్తారు మరియు భగవానుని దైవిక నిద్రను, దివ్య సృష్ఠిని అనుభవిస్తారు. తాము పూమాలా కైంకర్యము  భగవానునకై చేస్తారు.

ఆండాళ్ ఈ భావనను తన తిరుప్పావై 23వ పాశురమగు “మారిమలై ములైంజిల్” లో అనుభవిస్తుంది. నమ్మాళ్వార్ తిరువాయ్ మొళి 8.10దశకంలో “నెడుమార్కడిమై”   విశేష కైంకర్యము భాగవతులది అని స్థాపిస్తారు. అలాగే తిరువాయ్ మొళి 9.1దశకంలో “కొండపెండీర్ మక్కలే”లో ప్రధానమైన సూత్రాలను మానవులకు ఉపదేశిస్తారు.   “కిడన్ద  నాల్  కిడన్దై” అను తిరువాయ్ మొళి 9.2.3 పాశురంలో ఎంపెరుమాన్ మేల్కొనిన పిదప వారికి కైంకర్యమును చేయాలని  తమ ఆశను వెల్లడిస్తారు. విశ్వామిత్రఋషి, శ్రీమద్రామాయణం బాలకాండ-23.2 లో “కౌసల్యా సుప్రజా రామా” అని శ్రీరాముణ్ణి మేల్కొలుపుతాడు. అదే తరహాలో తొండరడిపొడిఆళ్వార్ , పెరియపెరుమాళ్ సౌందర్యమును అనుభవించి కైంకర్యముగా తిరుపళ్ళియెళిచ్చిని గానం చేశారు.

ఆదిత్యుడు ఉదయగిరి (తూర్పున ఉన్న పర్వతం)యందు అగుపిస్తాడు. తాను వెలుగును ప్రసాదించగానే, దేవతలు మరియు రాజులు  దేవాలయ దక్షిణ దిక్కున   వస్తుసామాగ్రిని తీసుకొని తిరువారాధనకై చేరుతారు. ఎంపెరుమాన్ కృపకు పాత్రులమవ్వాలని ఒకరినొకరు తోసుకుంటు ఎంపెరుమాన్ ముందు నిలబడతారు.

ఆళ్వార్, ఎంపెరుమాన్(అందరికి రక్షకుడు, శ్రీమహాలక్ష్మికి పతిఅయినవాడు, భక్త మందారుడు , అందరికి సులభుడు) ను తమ కైంకర్యమునందు తనను  న్నిమగ్నము చేయుమని అభ్యర్ధిస్తారు. ఎలాగైతే కొందరు తమ పిల్లలను చూపి తమ జీవనోపాధిని పొందుతారో, అలా ఆళ్వార్ ఉపస్థితి అయిన దేవతల(తమ స్వార్థకోరికలు తీర్చుకొనుటకై ఎదురుచూచు వారు)  చూపుతు తమ కోరికను(కైంకర్యము)నెరవేర్చమని ప్రార్థిస్తారు.

నఙ్జీయర్ అవతారిక పరిచయం ముగిసినది.

పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారికా పరిచయం

తొండరడిపొడిఆళ్వార్ తొలుత స్వరూప(నిజస్వభావం), ఉపాయ(సాధనం) మరియు పురుషార్ఠము యందు అఙ్ఞులుగా ఉండి తమ దేహమునే ఆత్మగా భావించేవారు.తాను  ప్రాపంచికానందముల యందు మరియు సన్నిహితులందు నిమగ్నమై ఉండేవారు.

పెరియపెరుమాళ్ తన నిర్హేతుక కృపవల్ల తమ సౌందర్యమును ఆళ్వార్ కు అనుగ్రహించారు. ఆళ్వార్ యొక్క ప్రాపంచిక కోరికలను నిర్మూలించి తమ వైపుకు ఆకర్షించారు.  ఆళ్వార్ కూడ పెరియపెరుమాళ్ కు  కైంకర్యం చేయు ఉద్దేశ్యముతో ఆశ్రయించిరి.  కాని పెరియపెరుమాళ్ (అర్చావతార రూపి) భౌతికంగా అతనితో కలవక అలా పడుకొని ఉన్నాడు.

తాను శయనించడం (మయా నిద్ర) ఆళ్వార్ ను విస్మరించుట కాదు అతనికి ఇంకా ప్రియమగుటకే. ఎంపెరుమాన్ శుద్ధసత్వగుణపూర్ణుడు. కావున తన  శయనం తమోగుణం వల్ల లేదా అజీర్తివల్ల కాదు కేవలం ఆళ్వార్ కోసమే.

  • జీవాత్మ అనుచిత సహజ స్వభావమగు భౌతిక స్థితిని   సంపూర్ణంగా తెలుకొనుట.
  • జీవాత్మ యొక్క సహజ  స్వభావం  మగు భాగవతులకు దాసునిగా ఉండుట గ్రహించుట.
  • ఆత్మ మరియు పదార్థం గురించి సంపూర్ణ ఙ్ఞానం కలిగి ఉండుట.
  • తన ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట.
  • ఇతర ఉపాయములైన కర్మ, ఙ్ఞాన మరియు భక్తి యోగములతో అనుబంధము లేకుండ ఉండుట.

పెరియపెరుమాళ్ తాను శ్రీరంగమున శయనించుట తన ప్రియమైన భక్తుడైన ఆళ్వార్ ను పొందుటకు చేయు ధ్యానమే, తన స్వవైభవం పరిగణలో ఆళ్వార్ ను సంస్కరించుట మరియు జీవాత్మలను ఎలా ఆళ్వార్ స్థాయికి తీసుకవచ్చి  ఉజ్జీవింపచేయాలనే చింతనమే మాయా నిద్ర.

సీతాపిరాట్టి వియోగ కారణంగా శ్రీరాముడు ఎన్నడు నిద్రించలేడు, అలాగే పెరియపెరుమాళ్ కూడ ఆళ్వార్ తన భక్తుడు అయ్యేంత వరకు నిద్రించలేడు.

కాని ఆళ్వార్ తన భక్తుడయ్యేసరికి పెరుమాళ్ ప్రశాంతంగా  నిద్రించసాగిరి.

ఆనాటి నుండి ఆళ్వార్ విషయాంతారాల వైపు వెళ్ళకుండ కేవలం కైంకర్యం మాత్రమే చేయసాగిరి. విశ్వామిత్రులవారు శ్రీరాముణ్ణి ‘కౌసల్యా సుప్రజారామా’ అని మేల్కొలుపుటను ఇదివరకే తెలుసుకున్నాము. అలాగే సీతాదేవి కూడ శ్రీమద్రామాయణం, సుందరకాండలో 38.25లో  “స మయా బోధిత శ్రీమాన్” అని మేల్కొలిపినది, ఆండాళ్ తన తిరుప్పావై 17వ పాశురాన కణ్ణన్ ను “ఉమ్బర్ కోమానే ఉఱంగాదెళుందిరాయ్”  అని ఆళ్వార్ తమ ప్రబంధములో   పెరియపెరుమాల్ ని ” అరంగత్తమ్మా పళ్ళియొళుందెరుళాయే” -మేల్కొలిపి తాను భాగవతుల సేవాకైంకర్యము యందు నిమగ్నమవ్వాలని  తమ ప్రబంధం చివరన ” తొండరడిపొడి యెన్నుమ్  అడియనై అళియ నెణ్ణఱుళి ఉన్నడియార్కు ఆట్పడుత్తాయ్” అని కోరుకున్నారు.

ఆళ్వార్  బలవంతముగా ఎంపెరుమాన్ ను మేల్కొలపడం తాము వారి కైంకర్యమున నిమగ్నమవ్వడం, కారణం ఎంపెరుమాన్ కు ఆనందముతో చేయు కైంకర్యమే తమ ప్రధాన లక్ష్యం.

ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీమద్రామాయణం- అయోధ్యకాండ-31.25శ్లోకమున “అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపతశ్చ తే” -నేను మీరు మేల్కొని ఉన్నప్పుడు , శయనించినపుడు సర్వావస్థల యందు సర్వవిధ కైంకర్యము చేయుదును” అని అన్నాడు. తిరువిరుత్తము 3.3.1 న   “ఒళవిళ్ కాలమెల్లాం ఉడయనాయ్ మన్ని” అను దశకమున నమ్మాళ్వార్ ఇలా అంటున్నారు-తాము సర్వావస్థలయందు , సర్వాకాలమందు, సర్వదా ఆనందము గురించి ఎంపెరుమాన్ కు కైంకర్యము చేస్తానని,అలాగే   తిరువాయ్ మొళి 2.9.4 యందు “మా ఆనందమునకై మీసేవలో సదా నిమగ్నపరుచుము”అని కోరుచున్నారు.

ఎంపెరుమాన్ నుండి ఆఙ్ఞను గైకొని  కైంకర్యము చేయునప్పుడు ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీమద్రామాయణం- అరణ్యకాండ-1.57శ్లోకమున ఇలా అన్నారు  ” క్రియతామితి మామ్ వద” – మీరు కుటీరనిర్మాణం చేయుమని నాకు ఆఙ్ఞను ఇవ్వండి( సీతాదేవి మరియు మీ ముఖోల్లాసమునకై)

ఆళ్వార్ తిరువాయ్ మొళి 8.5.7న ఎంపెరుమాన్ తో ఇలా అంటున్నారు ” ముగప్పే కూవిపణి కొల్లే”- మీముందుకు పిలచి నాకు మీ కైంకర్యమున నిమగ్నము చేయుము. కావున ఆళ్వార్ , ఎంపెరుమాన్ ను మేల్కొలిపి తమను కైంకర్యమున    నిమగ్నము చేయుమని అభ్యర్థిస్తున్నారు.

అంతిమంగా పెరియవాచ్చాన్ పిళ్ళై, తిరుమాలై మరియు తిరుపళ్ళియెళిచ్చి యందున్న వ్యత్యాసమును విశదపరచుచున్నారు.

  • తిరుమాలై లో – పెరుమాళ్ తాను ఆళ్వార్ (అనాదిగా సంసారమున ఉన్న) ను అఙ్ఞానము నుండి మేల్కొలిపారు. ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి) ఆళ్వార్ తాను పెరుమాళ్(ఆళ్వార్ యందున్న ప్రేమతో అన్నీ మైమరచిపోయిన) ను మేల్కొలుపుచున్నారు.
  • తిరుమాలై లో – ఆళ్వార్ వాచిక కైంకర్యమును కీర్తించారు(45-పున్ కవిదైయేలుమ్ ఎంబిరార్కు ఇనియవాఱే) గానము ద్వారా ,మాటలాడుట ద్వారా కైంకర్యము, ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి)- కాయిక కైంకర్యమును కీర్తించారు(10- తొడైయొత్త తుళవముం కూడైయుమ్ పొలిన్దు తోన్ఱియ తోళ్) శరీరముచే కైంకర్యము- అనగా వనమును ఏర్పరుచుట మాలలను కట్టుట వంటివి).
  • తిరుమాలై లో ఎంపెరుమాన్ కు ప్రీతి కల్గించు కైంకర్యమును స్వీకరించారు.(45-ఎంబిరార్కు ఇనియవాఱే).ఇక్కడ,(తిరుపళ్ళియెళిచ్చి) భాగవతులకు ప్రియమైన కైంకర్యమును ఒసగమని ప్రార్థించారు(అడియార్కు ఆట్పడుత్తాయ్)
  • తిరుమాలై లో- ఎంపెరుమాన్ ప్రయత్నములు ప్రథానమైనవి(ఆళ్వార్ ను సంస్కరించుటకు).ఇక్కడ (తిరుపళ్ళియెళిచ్చి)ఆ ప్రయత్నపు ఫలితములు ప్రతిఫలించుట ప్రథానమనది.
  • తిరుమాలై లో- ఆళ్వార్ , ఎంపెరుమాన్ ను తనను అంగీకరించి ఆశీర్వదించమన్నారు(ఎళియదోర్ అరుళుమన్ఱే ఎన్ తిఱత్తు).   ఇక్కడ(తిరుపళ్ళియెళిచ్చి) పరిణితి ఙ్ఞానముచే ఎంపెరుమాన్ ను కీర్తించుట(9-అవర్కు నాలోలక్కమరుళ)

పెరియవాచ్చాన్ పిళ్ళై  దివ్యప్రబంధ అవతారిక పరిచయం ముగిసినది.

అడియేన్ నల్లా శశిధర్  రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-introduction-avatharikai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment