శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
పాశుర అవతారిక
- నఙ్ఞీయర్ మరియు పెరియవచ్చాన్ పిళ్ళై తమ వ్యాఖ్యానములలో ప్రాతః కాలము అయినదని సూచనగా తూర్పు వాయువు వీచుట మరియు హంసలు మేల్కొనుటను తెలుపుతున్నారు. వీరు ముఖ్యముగా తెలుపునది – తొండరడిపొడి ఆళ్వార్ తాము ఆశ్రిత వత్సలుడగు భగవానుని మేల్కొని భక్తులను కటాక్షించవలసినదని అభ్యర్థిస్తున్నారు.
కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి
కూరన్దదు కుణతిశై మారుదం ఇదువో
ఎళుందన మలర్ అణై ప్పళ్ళికొళ్ అన్నం
ఈన్బని ననైంద తంఇరుం జిఱగుదఱి
విళుంగియ ముదలైయిన్ పిలం పురై పేళ్వాయ్
వెళ్ళెయిరుర అదన్ విడత్తినుక్కనుంగి
అళుంగియ ఆనైయిన్ అరుందుయర్కెడుత్త
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
కుణతిశై మారుదం = తూర్పు నుండి వీచు వాయువు.
కొళుంగొడి = బాగా వికసించిన తీగ
ముల్లైయిన్ = మల్లె తీగ
కొళు మలర్= అందమైన పుష్పములు
అణవి= స్పర్శ
ఇదువో= ఈ
కూరన్దదు= వీచు
మలర్ అణై = పుష్పపానుపు
ప్పళ్ళికొళ్= శయనించుట
అన్నం= హంసలు
ఈన్బని ననైంద= మంచు కురుయుట వలన తడిసిన
తం= వారి
ఇరుం జిఱగుదఱి= అందమైన రెక్కలు గల
ఉదఱి = వణుకుచున్న
ఎళుందన = మేల్కోనుట
విళుంగియ= మ్రింగిన/పట్టుకొనిన(ఏనుగు యొక్క కాళ్ళను)
ముదలైయిన్ = మకరం(మొసలి)
పిలం పురై = గుహ వలె
పేళ్వాయ్= పెద్దని నోరు
వెళ్ళెయిరుర = తెల్లని/పదునైన దంతములతో కరచిన/గాయపరచిన
అదన్ = ఆ ఏనుగు
విడత్తినుక్క= ఆ హానికి(ఆ దంత క్షతం వలన)
అనుంగి అళుంగియ= విపరీతమైన నొప్పితో బాధపడుతున్న
ఆనైయిన్ = ఆ ఏనుగుయొక్క(గజేంద్రాళ్వాన్)
అరుందుయర్ = చాలా బాధపడుచున్నవి
కెడుత్త= పోగొట్టు
అరంగత్తమ్మా! = శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా!
పళ్ళియెళుందరులాయే= (కావున) మీరు కృపతో మేల్కొని మమ్ము కటాక్షించుము
సంక్షిప్త అనువాదం :
తూర్పు పవనములు(మలయ మారుతములు) బాగా వికసించిన మల్లె తీగలను క్రమంగా తగులుతూ వీస్తున్నవి. పూలపాన్పుపై శయనించిన హంసలు పొగమంచుచే తడిసిన తమ రెక్కలను మరియు ఈకలను విదిలించుచూ లేస్తున్నవి. తన గుహలాంటి పెద్దని నోరుతో మరియు వాడియైన విషదంతములచే ఆ మకరము, గజేంద్రాళ్వాన్ పాదములను పట్టుకొని మ్రింగప్రయత్నించగా భరించలేని ఆ బాధను పోగొట్టగల గొప్పసామర్థ్యం కలవాడవు నీవు మాత్రమే. కావున శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! మీరు కృపతో మేల్కొని మమ్ము కటాక్షించుము.
నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు
- పెరియ తిరుమొళి 4.7.3 లో భగవానుడు తాను హంసావతారంలో వేదములను వెల్లడించాడు “అన్నమాయ్ అన్ఱు అంగరు మఱై పయందాన్ అరంగమా నగర్ అమరన్దానే” కాన ఆ హంసలు మేల్కొన్నాయి, శ్రీరంగనాథ మీరు కూడ అలానే మేల్కొనుము అని ఆళ్వార్ అభ్యర్థిస్తున్నారు.
- “పరమాపదం ఆపన్న” అని విష్ణుధర్మం- గజేంద్రాళ్వాన్ పెద్దఅపాయముతో చిక్కుకున్నాడు. కాన ఎంపెరుమాన్ అక్కడకు చేరుకొని గజేంద్రాళ్వాన్ అపాయమును తొలగించి వానిచే తామరపుష్పమును( గజేంద్రాళ్వాన్ తాను ఎంపెరుమాన్ కై పట్టుకొన్నది) తన పాదముల యందు సమర్పింప చేసుకొన్నాడు.
- ఇదే భగవంతుడి యొక్క అనుగ్రహం. అదే విధంగా తాను సంసారులను(విభవ అవతార అనంతరం ఉన్న) ఉజ్జీవింపచేయుటకు శ్రీరంగమున అర్చారూపి శ్రీరంగనాథుడిగా అవతరించాడు. తమ కోరికలను తీర్చి కటాక్షించుమని ఆళ్వార్ ప్రార్థిస్తున్నారు. ( గజేంద్రాళ్వాన్ యొక్క ఆపదను తొలగించినటుల)
పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:
- ఆళ్వార్ “పళ్ళికొళ్ అన్నమ్”అంటున్నారు- దివ్యదేశములలో(భగవానునకు చాలా ప్రీతి అయిన)అన్నింటికి -అనగా హంసలు కూడ గౌరవించబడతాయి. ఎంపెరుమానార్ తిరువేంకటమ్(తిరుమల)ని దర్శించడానికి వెళ్ళినప్పుడు తన మేనమామ మరియు ఆచార్యులైన పెరియ తిరుమలనంబి తానే స్వయంగా వారిని ఆహ్వానించడానికి ఎదురుగా వెళ్ళారు.
- అప్పుడు ఎంపెరుమానార్ వారితో ‘మమ్ములను ఆహ్వానించుటకు మీరెందుకు వచ్చారు ఎవరినైన చిన్నవారిని (స్థాయిలో) పంపవచ్చును కదా?’అని అన్నారు. దానికి పెరియ తిరుమలనంబి ” నమ్మిల్ శిఱియారిల్లై ఇంగు వత్తిప్పారిల్” (తిరుమల లో నివసించేవారిలో మా కన్నా చిన్నావారు (స్థాయిలో) ఎవరునూ లేరు)అని అన్నారు- ఇది అతని వినయానికి తార్కాణం.
- (నఙ్ఞీయర్ వ్యాఖ్యానము వలె) కావున ఆ హంసలు మేల్కొన్నవి, అలాగే ఆ హంస వలె ఉన్న ఎంపెరుమాన్ మీరు కూడ మేల్కొనుము.
- ఇక్కడ ఆళ్వార్” విళుంగియ” (పట్టుకొనబడిన)అని అంటున్నారు, ఆ మకరం బిగుతుగా/గట్టిగా గజేంద్రుని కాళ్ళను గాయపరచి పట్టుకున్నాడు. ఒక తల్లి తన పిల్లవాడు నూతి గోడపై అపాయంగా కూర్చున్నపుడు భయంతో ” అయ్యో పిల్లాడు ” అని గాబరాగా అరుస్తుందో అలా ఉన్నది ఈ స్థితి.
- “అరుమ్ తుయర్” – ఈ అపాయము చాలా క్లిష్ఠమైనది కావున పెరుమాళ్ , గజేంద్రాళ్వాన్ ను రక్షించడానికి నేరుగా పరమపదం నుండి దిగాడు.
- సముద్రమను ఈ సంసారమున మకరము వంటి ఐదు ఇంద్రియములచే మ్రింగివేయబడుచున్న మమ్ములను కాపాడుటకు లేచిరాక ఇంకా శయనించితివి ఏలా?
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-2-kozhungodi/
archived in http://divyaprabandham.koyil.org
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org